Movies"ఆ పార్టీలోకి వెళ్త..అందరి దూల తీర్చేస్తా"..శివాజీ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

“ఆ పార్టీలోకి వెళ్త..అందరి దూల తీర్చేస్తా”..శివాజీ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

శివాజీ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు బాగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఒకప్పుడు సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించిన శివాజీ ఆ తర్వాత పొలిటికల్ పరంగా కూడా టచ్ ఇచ్చాడు. ఆ టైంలో కొంతమంది పొగిడితే మరి కొంతమంది బూతులు తిట్టారు . రీసెంట్గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో గేమ్ ఆడి ఏకంగా టాప్ 3 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు . ఆ తర్వాత ఆయన 90స్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు . ఈ సిరీస్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ప్రతి ఒక్కరిని బాగా టచ్ చేసింది . ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆయన పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారిపోయారు . శివాజీ లోని నటనను మరోసారి అందరూ మెచ్చుకుంటున్నారు . రీసెంట్గా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో 90స్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి . సక్సెస్ మీట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ లో శివాజీ ఆసక్తికర విషయాలను బయట పెట్టాడు . పొలిటికల్ పార్టీ పరంగా క్వశ్చన్స్ ఎదురైయాయి.

” మీరు సమైక్యవాది కదా తెలంగాణ ప్రాంతంకి సంబంధించిన పాత్రను పోషించడం ఎలా అనిపించింది..?” అని ప్రశ్నించారు ఒక రిపోర్టర్. దానికి ఆయన స్పందిస్తూ ..”ఒక విషయం మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి నేను సమైక్యవాదిని కాదు ప్రత్యేక హోదా కోసం పాటుపడ్డాను ..పోరాడాను అంతే సమైక్యవాదాన్ని ఎప్పుడు వినిపించలేదు.. ప్రత్యేక తెలంగాణ అనేది 60 సంవత్సరాల కల అది సహకారం అయిపోయింది దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు ..రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల హ్యాపీగా కలిసి ఉన్నాయి .అది చాలు. నాకు యాక్టింగ్ తప్ప మరొకటి రాదు ఒకవేళ ప్రజలకు సమస్యలు వస్తే మాత్రం అది రేపొద్దున వచ్చిన సరే ఎప్పుడు వచ్చినా సరే ప్రజల కోసం కచ్చితంగా నేను గొంతు విప్పుతాను .. నన్ను కావాలని ఒక పార్టీకి అంటగట్టాలని చూస్తే ఖచ్చితంగా ఆ పార్టీలోకి వెళ్తా ..అందరి దూల తీర్చేస్తా ..కాబట్టి దయచేసి నా జోలికి రావద్దు ఎందుకంటే నేను అన్ని నిజాలే మాట్లాడుతాను ..అందరికీ అదే ప్రాబ్లం” అంటూ తనదైన స్టైల్ లో రఫ్ఫాడించేసాడు శివాజీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news