Movies"ఆయనను చూడగానే నాకు క్రిస్మస్ తాత గుర్తొచ్చాడు"..అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ పై...

“ఆయనను చూడగానే నాకు క్రిస్మస్ తాత గుర్తొచ్చాడు”..అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ పై అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్..!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ ఉంటారు . స్క్రిప్ట్ ప్రకారం నడుచుకుంటూ పోతారు.. ఏదైనా షోస్ కి వెళ్ళిన.. ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయిన .. వీళ్లు వాళ్ళ చేతికి స్క్రిప్ట్ ఇస్తారు ..లేదా..? వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ ని తూచా తప్పకుండా బట్టి పట్టి చదివేస్తారు . అంతే ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరోయిన్స్ చాలా చాలా తక్కువ . అయితే ఆ తక్కువలో మన హీరోయిన్ అనుష్క శెట్టి కూడా వస్తుంది .

అనుష్క శెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అనుష్క తనదైన స్టైల్ సినిమాలో నటించి తన క్రేజ్ ను ఓ రేంజ్ లో పెంచేసుకుంది . ఒకానొక షోలో పాల్గొన్న అనుష్క తాను ఒక డైరెక్టర్ ని చూడగానే “క్రిస్మస్ తాత” గుర్తొచ్చాడు అంటూ చెప్పుకొచ్చింది. ఆయన మరెవరో కాదు “రాఘవేంద్రరావు గారు”.

సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనుష్క ఫస్ట్ టైం రాఘవేంద్రరావు గారిని చూడగానే క్రిస్మస్ తాత లాగే ఉన్నాడు అంటూ ఫీల్ అయిందట . నాగార్జున గారు వచ్చి ఇవాళ మనం ఒక స్పెషల్ పర్సన్ ని మీట్ అవుతున్నాము అంటూ చెప్పగానే ..ఎవరో అనుకున్నారట.. తీరా మెట్లు నేను ఎక్కుతున్నప్పుడు అటువైపు నుంచి ఒక ఆయన దిగుతూ వచ్చాడు అని ..అప్పుడే ఆయన వైట్ ప్యాంటు ..వైట్ షర్ట్ వేసుకొని తెల్ల గడ్డంతో కనిపించాడు అని.. సడన్గా చూడగానే క్రిస్మస్ తాత లాగే అనిపించాడు అని ..చెప్పుకు వచ్చింది. అప్పుడు రాఘవేంద్రరావు గారు కూడా పక్కనే ఉండడం గమనార్హం . అనుష్క శెట్టి మాటలకు అక్కడ ఉండే వారంతా నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news