Movies"సమంత" గూబ గుయ్యమనేలా "శోభిత"ను కౌంటర్ ఇవ్వమని చెప్పింది ఆ స్టార్...

“సమంత” గూబ గుయ్యమనేలా “శోభిత”ను కౌంటర్ ఇవ్వమని చెప్పింది ఆ స్టార్ హీరోనా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ రూమర్..!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఇద్దరు హీరోయిన్స్ ఒక స్టార్ హీరో కోసం కొట్టుకోవడం సినిమా ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది . ఆ హీరోయిన్లు ఎవరో మనకు తెలిసిందే . సోషల్ మీడియాలో ప్రజెంట్ హీరోయిన్ సమంత హీరోయిన్ శోభిత దూళిపాల మధ్య వార్ పీక్స్ కి చేరుకుంది . సమంత ఒక పోస్ట్ పెడితే దానికి గూబ గుయ్యమని ఆన్సర్ ఇస్తూ శోభిత ధూళిపాల కౌంటర్స్ వేస్తుంది .

ఇది వాళ్ళు చేసే పోస్ట్లు ఆధారంగా తెలిసిపోతుంది. మనకు తెలిసిందే సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విడాకులు తీసుకున్నారు . ఆ తర్వాత నాగచైతన్య -శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడు అని ఒకసారి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని మరొకసారి వార్తలు వినిపిస్తున్నాయి . అయితే రీసెంట్గా నాగచైతన్య – శోభిత ధూళిపాల పెళ్లి ఫిక్స్ అంటూ నేషనల్ మీడియాలో సైతం వార్తలు వినిపించాయి .

దీంతో సమంత కడుపు మండి తన వెడ్డింగ్ డ్రెస్ ను రీ క్రియేట్ చేసేసింది అన్న ప్రచారం కూడా జరిగింది . అంతేకాదు వృషభ రాశి వారిని వదులుకోకండి అంటూ కూడా సంచలన పోస్ట్ చేసింది. ఇది కేవలం నాగచైతన్య – శోభిత కు కౌంటర్ అంటూ చాలామంది చెప్పుకొచ్చారు. అయితే తాజాగా శోభిత ధూళిపాల చేసిన పోస్ట్ సమంతకు గుయ్యమనే కౌంటర్ ఇచ్చింది అంటున్నారు జనాలు.

శోభిత ధూళిపాల తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ..”నేను ప్రతి ఒక్కరి కప్ ఆఫ్ చాయ్ కాదు ..దట్స్ ఓకే” అంటూ పోస్ట్ చేసింది . ఆమె చాయ్ అందా..? చెయ్ అందా..? అని అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు జనాలు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు ఇది పూర్తిగా సమంతకు గూబ గుయ్యమనే కౌంటర్ అంటున్నారు . అయితే సోషల్ మీడియాలో మరొక వార్త కూడా వైరల్ గా మారింది . ఈ విధంగా శోభిత ధూళిపాళ్ల దగ్గర పోస్ట్ చేయించింది అక్కినేని నాగార్జున అంటూ ప్రచారం జరుగుతుంది . దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news