Moviesవెంకటేష్ చేయాల్సిన సినిమాను దొబ్బేసి మరి హిట్ అందుకున్న నాగార్జున.. ఆ...

వెంకటేష్ చేయాల్సిన సినిమాను దొబ్బేసి మరి హిట్ అందుకున్న నాగార్జున.. ఆ క్రేజీ మూవీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం మాయాలోకం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు కనిపెట్టలేరు . అలాంటి మాయలకు బలైపోయిన వాళ్ళు ఎందరో . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కోసం రాసుకున్న కథను మరో స్టార్ హీరో చేస్తూ ఉండటం కూడా కామన్ గా చూస్తూ ఉంటాం. అదే లిస్టులోకి వస్తారు నాగార్జున – వెంకటేష్ .

నాగార్జున వెంకటేష్ ఒకప్పుడు జాన్ జిగిడి దోస్తులు ..ఆ తర్వాత బంధువులుగా మారి ఆ తర్వాత శత్రువులుగా మారిపోయారు . ఆ తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే కలుసుకుంటున్నారు. గతంలో వెంకటేష్ చేయాల్సిన సూపర్ హిట్ సినిమాను నాగార్జున చేసి కేక పెట్టించే హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఆ సినిమా మరేదో కాదు శివ .

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా నాగార్జున కెరియర్ లోనే టాప్ టెన్ మూవీస్ లో ఒకటిగా ఉంటుంది . అప్పటివరకు కేవలం క్లాస్ లుక్ లో కనిపించిన నాగార్జున మాస్ లుక్ లో కూడా కనిపించి అభిమానులను మెప్పించాడు. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనాలు ఎన్నో . ఇప్పటికీ ఆ రికార్డులు బ్రేక్ చేయలేకపోతున్నారు యంగ్ హీరోస్. అయితే ఈ సినిమాని మొదటిగా వెంకటేష్ తో తరికెక్కించాలనుకున్నారట రాంగోపాల్ వర్మ.

అప్పుడప్పుడే ఆయన పేరు వినిపిస్తున్న క్రమంలో పెద్దగా కథ కూడా ఆయనకు నచ్చకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశారట వెంకటేఅష్. ఆ తర్వాత ఈ కథను నాగార్జున ఓకే చేసి సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news