Moviesరోజురోజుకీ దానిని పూర్తిగా వదిలేస్తున్న అనుష్క శెట్టి.. ఫ్యాన్స్ డిసప్పాయింట్.. స్వీటీకి...

రోజురోజుకీ దానిని పూర్తిగా వదిలేస్తున్న అనుష్క శెట్టి.. ఫ్యాన్స్ డిసప్పాయింట్.. స్వీటీకి అస్సలు ఏమైంది..?

చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలు డబ్బుల కోసమే వస్తారు . చాలా తక్కువ మంది మాత్రమే క్రేజ్ కోసం తమకున్న టాలెంట్ ని నలుగురుకి చూపించాలి అనే ఉద్దేశంతో వస్తారు . అలాంటి తక్కువ మంది హీరోయిన్స్లలో అనుష్క శెట్టి కూడా ఒకరు . సూపర్ సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన అనుష్క శెట్టి .. ఆ తర్వాత ఎన్ని క్యారెక్టర్స్ తో మెప్పించిందో మనకు తెలిసిందే .

హిట్లు ఫ్లాపులు అంటూ సంబంధం లేకుండా వరుసగా బడాబడా సినిమాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే సడన్గా ఆమె పలు ప్రయోగాత్మక సినిమాలలో నటించి తన బాడీను టోటల్గా మార్చేసుకుంది . అనుష్క శెట్టి సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన అభిమానులకు మాత్రం ఆమె ఫేవరెట్ హీరోయిన్గా ఉండిపోయింది . దాదాపు మూడు సంవత్సరాలు తెరపై కనిపించక పోయినా సరే ఆ తర్వాత రిలీజ్ అయిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను ఫ్యాన్స్ హిట్ చేసి పెట్టారు అంటే దానికి ఏకైక కారణం అనుష్క అనే చెప్పాలి .

అయితే ఈ మధ్యకాలంలో అనుష్క తన క్రేజ్ ను వదిలేస్తుంది . స్టార్ డైరెక్టర్ లు అవకాశాలు ఇస్తున్నా సరే సునాయాసంగా రిజెక్ట్ చేయడం అభిమానులకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . పోనీ పెళ్లి చేసుకోబోతుందా ..? అందుకే ఇలా ఆఫర్లు వదిలేస్తుందా ..?అంటే అదీ లేదు . పెళ్లి పై మాత్రం నోరు విప్పట్లేదు అనుష్క. దీంతో ఫాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకు స్వీటీ ఇలా చేస్తుంది అటు సినిమాలు చేయక ఇటు పెళ్లి చేసుకోక ఏం చేస్తుంది అంటూ మండి పడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news