Moviesవిన్నర్ గా నిలవాల్సిన శివాజీ.. ఇలా టాప్ 3 ప్లేస్ లో...

విన్నర్ గా నిలవాల్సిన శివాజీ.. ఇలా టాప్ 3 ప్లేస్ లో ఎలిమినేట్ అవ్వడానికి కారణం..ఆ మూడు మాటలేనా..?

తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్లు బిగ్ బాస్ హౌస్ లో ఊహించినవి ఎన్నెన్నో జరిగాయి . ఇన్నాళ్లు బిగ్ బాస్ హౌస్ లో కొట్టుకొని చచ్చిపోయిన కంటెస్టెంట్స్ ఎట్టకేలకు హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా మొదటి నుంచి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వగానే రన్నర్ గా పల్లవి ప్రశాంత్ విన్నర్ గా శివాజీని అనుకున్నారు జనాలు .

సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు కూడా అదే ప్రచారం జరిగింది . శివాజీ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ఓటింగ్స్ కూడా ప్రమోట్ చేశారు. కానీ లాస్ట్ మూమెంట్లో విన్నర్ గా కాదు కదా రన్నర్ గా కూడా నిలవలేకపోయాడు శివాజీ. టాప్ త్రీ కంటెస్టెంట్ గానే ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దానికి కారణం ఆయన హెడ్ వెయిట్ ..ఆయన అహంకారం ..ఆయన తల పొగరు అంటూ పలువురు ఘాటుగా స్పందిస్తున్నారు.

హౌస్ లో స్టార్టింగ్ లో కాఫీ కోసం రచ్చ చేసిన శివాజీ ఆ తర్వాత పలు విషయాల్లో కూడా అంతే సెల్ ఫిష్ గా ఉన్నారని.. ఆయనకు కావాల్సిన వాళ్లతో మాత్రం బాగా మూవ్ అవుతూ పక్క వాళ్ళను టార్గెట్ చేసే విధంగా పక్క వాళ్ళతో నామినేట్ చేయించారని ..దేవుడు అన్ని చూస్తున్నాడు అని అందుకే ఇలా ఆయన ఎలిమినేట్ అయిపోయాడు అని .. అటు రన్నర్ గా కాకుండా ఇటు విన్నర్ గా కాకుండా ఎలిమినేట్ అవ్వడం ఆయనకు దేవుడు వేసిన శిక్ష అని చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news