Newsనాతో ప‌డుకో అంటూ సింగ‌ర్ చిన్మ‌యికి మెసేజ్‌... ఎలాంటి రిప్లే ఇచ్చిందో...

నాతో ప‌డుకో అంటూ సింగ‌ర్ చిన్మ‌యికి మెసేజ్‌… ఎలాంటి రిప్లే ఇచ్చిందో చూడండి..!

ప్ర‌ముఖ సింగ‌ర్‌గ‌గా శ్రీపాద చిన్మ‌యికి మంచి గుర్తింపు ఉంది. ఆమె యంగ్ హీరో, డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో ప్రేమ వివాహం జ‌రిగింది. ఆమె కేవ‌లం సింగ‌ర్ మాత్ర‌మే కాదు మ‌న స్టార్ హీరోయిన్ స‌మంత‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం ఇలా మ‌ల్టీ టాలెంటెడ్ అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే చిన్మయి ప్ర‌తి విష‌యంలోనూ స్పందిస్తూ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

ఆమె ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడుతూ అటు వైపు ఉన్న వాళ్లు ఎంతటోళ్లు అయినా ఏ మాత్రం వెనక్కు త‌గ్గ‌కుండా విరుచుకు ప‌డుతూ ఉంటుంది. తాజాగా ఆమెకు ఓ నెటిజ‌న్ నుంచి అస‌భ్య‌క‌ర మెసేజ్ వ‌చ్చింది. దానికి చిన్మ‌యి అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చింది. ముందుగా స‌ద‌రు నెటిజ‌న్ మీరంటే నాకు చాలా ఇష్టం.. సాటి అమ్మాయిల కోసం మీరు నిల‌బ‌డి పోరాటం చేసే తీరు నాకు న‌చ్చుతుంద‌ని.. మా సోద‌రి కూడా ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల ఇబ్బంది ప‌డింద‌ని కామెంట్ చేశాడు.. దీనిని చిన్మ‌యి ప‌ట్టించుకోలేదు.

కొద్ది రోజుల త‌ర్వాత చిన్మ‌యి నుంచి రిప్లే రాక‌పోవ‌డంతో మ‌నోడు ఘాటుగా స్పందించాడు. నీకు ఎంత డ‌బ్బు కావాలంటే అంత ఇస్తాను.. నాతో కొంత టైం స్పెండ్ చేయి.. అంటూ వేరే అర్థం వ‌చ్చేలా మాట్లాడాడు. అంత‌టితో ఆగ‌కుండా నీకు ఏం కావాల‌న్నా కొంటాను.. ల‌గ్జ‌రీ జీవితాన్ని ఇస్తాను అంటూ వ‌రుస పెట్టి మెసేజ్‌లు పెట్టాడు.

దీంతో ఒక్క‌సారిగా చిన్మ‌యి ఫైర్ అయ్యింది. ఈచెత్త వెధ‌వ‌ను చూడండి.. ముందు ప‌ద్ధ‌తిగా మెసేజ్‌లు చేశాడు. నానుంచి రిప్లే రాక‌పోవ‌డంతో వాడిలో అస‌లు మ‌నిషి బ‌య‌ట‌కు వ‌చ్చాడు.. ఇలాంటి వాడ్ని ఏం చేయాలి ? ముందు వీడిని ఇలా పెంచినందుకు వీడి నాన్నను అనాల‌ని.. ఇలాంటి వెధ‌వ‌లు స‌మాజంలో చాలా మందే ఉన్నారు… అమ్మాయిలు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news