Movies‘సామజవరగమన’ వసూళ్ల సునామీ.. శ్రీ విష్ణు కెరీర్ లోనే సంచలన...

‘సామజవరగమన’ వసూళ్ల సునామీ.. శ్రీ విష్ణు కెరీర్ లోనే సంచలన రికార్డ్..4 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది . భారీ భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి . అయితే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన సినిమాలు హిట్ అవుతున్నాయి. ఆ లిస్ట్ లోకే యాడ్ అయిపోయింది టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న శ్రీ విష్ణు నటించిన “సామజవరగమన” సినిమా .

ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. టాలీవుడ్ స్టార్ ప్రముఖులు కూడా ఈ సినిమా గురించి పాజిటివ్గా ట్విట్ చేస్తున్నారు . సినిమా చాలా బాగుందని మనస్ఫూర్తిగా నవ్వుకొని చాలా రోజులు అవుతుంది అని ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు . కాగ దీంతో ఈ సినిమాకి సంబంధించిన టాక్ వైరల్ గా మారింది . నరేష్ – వెన్నెల కిషోర్ వంటి వారు కూడా ఈ సినిమాలో కామెడీ టైమింగ్ తో అదరగొట్టేసారని చెప్పాలి .

దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను చాలా ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించారు. ఈ మధ్యకాలంలో సరైన హిట్ అందుకొని శ్రీ విష్ణుకు ఇది మంచి కమ్ బ్యాక్ అనే చెప్పాలి . ఈ సినిమాలో శ్రీ విష్ణు నటన చాలా అద్భుతంగా ఉంది అంటూ స్టార్ ప్రముఖుల ప్రశంసిస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీ స్థాయిలో వసూలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . జూన్ 29న గ్రాండ్గా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా నాలుగు రోజులు పూర్తి చేసుకునే టైంకి ఏకంగా 10 కోట్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా 4వ రోజు కొన్ని చోట్ల వర్షాల వలన ఇబ్బందులను ఫేస్ చేసినా కూడా. ఓవరాల్ గా 4 వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 19.8 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news