Moviesఏఎన్నార్‌ను పెళ్లికి నో చెప్ప‌డంతో ర‌చ్చ ర‌చ్చ చేసిన స్టార్ హీరోయిన్‌…!

ఏఎన్నార్‌ను పెళ్లికి నో చెప్ప‌డంతో ర‌చ్చ ర‌చ్చ చేసిన స్టార్ హీరోయిన్‌…!

సినిమా రంగంలో హీరోలు, హీరోయిన్లు ప్రేమించుకోవడం ఎఫైర్లు పెట్టుకోవడం, డేటింగ్ లు చేయటం.. కామన్. విచిత్రం ఏమిటంటే ఎంత గాఢంగా ప్రేమించుకుంటారో . అంతే త్వరగా విడిపోతూ ఉంటారు. ప్రేమలో ఉన్నప్పుడు ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత అన్యోన్యతతో ఉంటారు. అదే బ్రేకప్ చెప్పుకున్నాక అసలు ఇద్దరి మధ్య ఒకరి నీడ కూడా ఒకరికి గిట్టనంత శత్రువులుగా మారిపోతూ ఉంటారు. అసలు ప్రేమించేటప్పుడు అటువైపు ఉన్న వ్యక్తికి ఎన్ని ? పెళ్లిళ్లు అయినా పట్టించుకోరు.

ఎంతమంది భార్యలు ఉన్నా ? అవేమీ చూడరు. పిల్లలు ఉన్నారు అన్న విషయం కూడా పట్టించుకోరు. తాము ప్రేమిస్తున్నాం అన్న మైకంలో మునిగిపోతారు. అదే బ్రేకప్ తర్వాత వారిని అంతే శత్రువులుగా చూస్తూ ఉంటారు. దివంగత సీనియర్ హీరో ఏఎన్నార్ సైతం ఒక సీనియర్ హీరోయిన్ ప్రేమ పగకు గురికావాల్సి వచ్చిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పటి అందాల తార ఎస్ వరలక్ష్మి. ఏఎన్నార్ వరలక్ష్మి కాంబినేషన్లో బాలరాజు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.

వ‌ర‌ల‌క్ష్మి స‌తీసావిత్రి, బాల‌రాజు, శ్రీవెంక‌టేశ్వ‌ర మ‌హ‌త్యం, శ్రీకృష్ణార్జున యుద్ధం, ప్రేమ‌న‌గ‌ర్‌లో సినిమాల‌లో న‌టించారు. ప్రేమ‌న‌గ‌ర్లో అయితే స‌త్య‌నారాయ‌ణ భార్య పాత్ర‌లో మెప్పించారు. అయితే ఏఎన్ఆర్ కు అన్నపూర్ణమ్మ‌తో పెళ్లి జరగక ముందు నుంచే వరలక్ష్మి ఆయన్ను బాగా ఇష్టపడ్డారు. వెండితెర‌పై వారిద్ద‌రి కెమిస్ట్రీ బాగా పండేది. ఇక బయట కూడా ఏఎన్ఆర్ తనను ప్రేమిస్తున్నారని.. తామిద్దరం త్వరలోనే వెళ్లి కూడా చేసుకోబోతున్నామంటూ ప్రచారం ప్రారంభించారు వ‌ర‌ల‌క్ష్మి.

అయితే ఈ ప్రచారం తెలిసిన ఏఎన్ఆర్ తన భవిష్యత్తు నాశనం అవుతుందని భావించి.. దర్శక నిర్మాతలకు తన పక్కన వరలక్ష్మిని హీరోయిన్గా బుక్ చేయవద్దని.. అలా చేస్తే తాను నటించన‌ని తేల్చి చెప్పారు. ఈ విషయం తెలిసిన వరలక్ష్మి ఏఎన్నార్ పై విపరీతంగా కోపం పెంచుకుంది. ఏఎన్ఆర్ ను ఏదోలా సాధించాలని పగతో రగిలిపోయింది. అయితే ఏఎన్ఆర్ ఆ తర్వాత తిరుగులేని స్టార్ హీరో అయిపోయారు. వరలక్ష్మి ప్రేమ పగ ఆయన్ను ఏమీ చేయలేక పోయింది. ఇక వరలక్ష్మికి దూరం జరిగిన వెంటనే ఏఎన్నార్ అన్నపూర్ణమ్మను పెళ్లి చేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news