Moviesసౌంద‌ర్య నిజంగానే ఆ స్టార్ హీరోను ప్రేమించిందా… ఆ ప్రేమ‌కు కార‌ణం...

సౌంద‌ర్య నిజంగానే ఆ స్టార్ హీరోను ప్రేమించిందా… ఆ ప్రేమ‌కు కార‌ణం ఇదే..!

దివంగత అందాల తార సౌందర్య అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక పిచ్చి ప్రేమ. ఒక ఆరాధన భావం.. నిజంగా సౌందర్య చాలా మంది హీరోయిన్గా చూడలేదు. తమ ఇంటి ఆడపడుచుగా తమ ఇంటి కోడలిగా.. తమ ఇంటి అమ్మాయిగా.. తమ ఇంట్లో ఒక అక్క, ఒక చెల్లిగా చూసుకున్నారు. తెలుగు ప్రేక్షకులలో సౌందర్యకు అంత గొప్ప అనుబంధం ఇమిడి ఉంది. సౌందర్య స్వతహాగా కన్నడ అమ్మాయి అయినా ఆమెకు మంచి లైఫ్ ఇచ్చి తిరుగులేని స్టార్ హీరోయిన్ ను చేసింది మాత్రం ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు.. తెలుగు సినిమా రంగమే అని చెప్పాలి. అసలు సౌందర్యకు కన్నడంలో లేని ఇమేజ్ తెలుగులో ఉంది.

దాదాపు 15 సంవత్సరాలు పాటు సౌందర్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరిగిలేని స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఎంతమంది హీరోయిన్లు వచ్చిన సౌందర్యకు ఏమాత్రం పోటీ ఇచ్చేవారు కాదు. సౌందర్య తెలుగులో స్టార్ హీరోలు అందరితోనూ కలిసి నటించింది. చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు మాత్రమే కాదు… రాజశేఖర్, సాయికుమార్, శ్రీకాంత్, జ‌గ‌ప‌తిబాబు, మోహన్ బాబు లాంటి హీరోల పక్కన కూడా ఆమె నటించింది.

తెలుగులో ఒక సీనియర్ హీరోను ఆమె పిచ్చిగా ఆరాధించిందని.. ఎంతో ప్రేమించిందని కూడా అంటారు. ఆ హీరో ఎవరో కాదు జగపతిబాబు. జగపతిబాబు ఎవరిని నొప్పించని మనస్తత్వం.. సౌందర్యను ఎంతో బాగా చూసుకోవటం, ఎవరి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడకపోవడం.. అలాగే స్నేహం విషయంలో ఎవరికీ ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవడం.. స్నేహితులకు అన్ని తానే ఖర్చు పెట్టుకోవడం.. ఇలా ఎన్నో అంశాలు సౌందర్య జగపతిబాబు పట్ల ఆకర్షితురాలు అయ్యేలా చేశాయని అంటారు.

మరి ముఖ్యంగా జగపతిబాబు సౌందర్య పట్ల ఎంతో స్పెషల్ కేర్ తో ఉండే వారట. తన పట్ల ఆ ప్రత్యేకమైన అభిమానం కూడా సౌందర్య జగపతిబాబు పట్ల ఇష్టాన్ని పెంచుకోవడానికి కారణం అయిందని అంటారు. అప్పటికే జగపతిబాబుకు పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. కానీ సౌందర్య ఎందుకో జగపతిబాబును బాబు అంటూ పిలుస్తూ బాగా ఇష్టపడేదని అప్పట్లో టాలీవుడ్ లో టాక్ అయితే ఉంది. ఇది చాలామందికి తెలిసిన విషయమే. అందుకే సౌందర్య చనిపోయినప్పుడు కూడా జగపతిబాబు ఎంతో బాధపడ్డారు అని ఆయనే స్వయంగా చాలా సందర్భాలలో చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news