Moviesరు . 2 వేల కోట్లు కొల్ల‌గొట్టిన సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా...

రు . 2 వేల కోట్లు కొల్ల‌గొట్టిన సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా ఇదే… క‌నివినీ ఎరుగ‌ని రికార్డులు…!

లవకుశ సినిమా నిజంగా తెలుగువారి స్థిరాస్తి లాంటిది. కమర్షియల్ గా లవకుశ సాధించిన విజయం ఇన్ని దశాబ్దాలు అవుతున్నా కూడా నభూతో న‌ భవిష్యత్తు అని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు టిక్కెట్ ధరలు పావలా నుంచి రూపాయి వరకు ఉండేవి. పెద్ద పెద్ద పట్టణాలలో రెండు రూపాయలు ఉంటుందేమో..! అప్పుడు సమైక్యాంధ్ర రాష్ట్ర జనాభా మూడు కోట్లు. ఆ రోజుల్లోనే లవకుశ సినిమా కోటి రూపాయలకు పైగా వసూలు చేసింది అంటే ఆ సినిమా స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. 50 నుంచి 60 లక్షల జనాభా ఉన్న 100 కేంద్రాలలో రెండు కోట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అంటే జనాభాకు మించి నాలుగు రెట్ల టిక్కెట్లు అమ్ముడు అయ్యాయన్నమాట

దీనిని బట్టి చూస్తే ఈ సినిమా సాధించిన గొప్ప రికార్డును మనం అర్థం చేసుకోవాలి. ఇవాల్టి రోజున ఏ సినిమాకు అయినా ఇలాంటి ఆదరణ దక్కి ఉంటే ఆ సినిమా చాలా సింపుల్గా రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఉండేది. ఆ రోజుల్లో లవకుశ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఇప్పటి రోజుల్లో లెక్కలు వేసుకుంటే రెండు వేల కోట్లతో సమానం. పైగా ఈ వసూళ్లన్నీ కేవలం దక్షిణ భారతదేశానికే పరిమితం. ఇప్పుడు అంటే సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నాయి.

పైగా పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు. అటు ఓవర్సీస్‌తో పాటు ఇతర దేశాల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు అలాంటి పరిస్థితి లేదు. లవకుశ కేవలం తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషలోనే ఈ స్థాయిలో వసూలు కొల్లగొట్టింది. ఇంకా చెప్పాలంటే బాహుబలి 2 సినిమా కంటే కూడా లవకుశ ఆరోజుల్లో ఎక్కువ వసూలు కొల్లగొట్టిందని చెప్పాలి. లవకుశ సాధించిన రికార్డులు అన్ని ఇన్ని కావు.

వ‌రంగ‌ల్ రాజరాజేశ్వరి థియేటర్లో ల‌వ‌కుశ సినిమాను 4,34,800 మంది చూసారు. అయితే అప్పటి వరంగల్ జనాభా కేవలం ఒక లక్ష మాత్రమే. ఈ లెక్క‌న ఒక్కొక్క‌రు ఈ సినిమాను 4 సార్ల‌కు పైగా చూశారు. అలాగే క‌ర్నాక‌ట‌లో ఈ సినిమా ఓ థియేట‌ర్లో 35 వారాలు ఆడింది. అలాగే 1977, 1980లో ఈ సినిమా రిపీట్ రన్ గా రిలీజ్ అయ్యి శతదినోత్సవాలు జరుపుకుంది. ఇలా ఓ సినిమా మూడుసార్లు రిలీజ్ అయ్యి బెంగ‌ళూరులో 100 రోజులు ఆడ‌డం అనేది క‌న్న‌డ సినిమాల‌కు కూడా లేని రికార్డ్‌.

ఇక 1963 మార్చి 29న విడుదలైన ఈ సినిమా విడుదలైన 26 కేంద్రాలలో 100 రోజులు ఆడ‌గా… అలాగే లేట్ ర‌న్‌లో 46 కేంద్రాలలో వందరోజులు ఆడిన ఏకైక సినిమా లవకుశ. అలాగే తెలుగులో మొద‌ట 500 రోజులు ఆడిన సినిమా కూడా ల‌వ‌కుశే. ఆయ‌న పాతాళ‌భైర‌వి 245 రోజులు ఆడ‌గా.. ఆ రికార్డ్‌ను ల‌వ‌కుశ బీట్ చేసింది. అస‌లు రిపీట్ ర‌న్‌లు కూడా క‌లిపితే ల‌వ‌కుశ 100కు కేంద్రాల్లో 100 రోజులు ఆడిన‌ట్లు.

ల‌వ‌కుశ త‌మిళ్ వెర్ష‌న్ కూడా సూప‌ర్ హిట్‌.. మధురైలో 40 వారాలు ఆడింది. హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ కూడా సిల్వర్‌జూబ్లీ కొట్్టింది. ఒకే సినిమాతో ఒకే హీరో మూడు భాష‌ల్లో రెండు సార్లు సెంచ‌రీలు కొట్టిన రికార్డ్ ఒక్క ఎన్టీఆర్‌కే సాధ్య‌మైంది. ఆ యేడాది నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా లవకుశ రాష్ట్రపతి నుంచి బహుమతి అందుకుంది. ఒకే సంవత్సరం లవకుశ, నర్తనశాల, కర్ణన్‌ (తమిళం) లాంటి మూడు సినిమాల్లో న‌టించింనందుకు ఎన్టీఆర్‌ రాష్ట్రపతి నుంచి ప్రత్యేక బహుమతి అందుకోగా… ఇలా మూడు చిత్రాలకు కలిపి ఒకేసారి జాతీయ బహుమతిని భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ న‌టుడూ అందుకోలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news