Moviesర‌మ్య‌కృష్ణ కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ టార్గెట్ ఆ స్టార్ డైరెక్ట‌రేనా ?

ర‌మ్య‌కృష్ణ కాస్టింగ్ కౌచ్ కామెంట్స్ టార్గెట్ ఆ స్టార్ డైరెక్ట‌రేనా ?

తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు అందరి సినిమాలలో నటించి గత నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది ప్రముఖ హీరోయిన్ రమ్యకృష్ణ. రమ్యకృష్ణ నటన గురించి ఇప్పుడు కొత్తగా సినిమా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఎంతో మంచి నటి ‘బాహుబలి’ సినిమాతో ఆమె దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయింది. బాహుబ‌లి సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకు మరో నటిని కలలో కూడా ఊహించుకునే పరిస్థితి లేదంటే ఆమె ఎంతలా ? ఆ పాత్రలో జీవించిందో అర్థమవుతుంది.

స్వతహాగా తమిళ సినిమా నటి అయినా రమ్యకృష్ణ తెలుగు దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రమ్యకృష్ణ సినీ ప్రేమికుల నుంచి మాత్రమే కాదు విమర్శకుల నుంచి కూడా తన నటనకు మంచి మార్కులు ఎన్నోసార్లు వేయించుకున్నారు. ప్రస్తుతం వయసు పై పడటంతో రమ్యకృష్ణ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది. అయితే కెరీర్ ప్రారంభంలో రమ్యకృష్ణ కూడా ఎన్నో ఇబ్బందులు పడింది. నటిగా అవకాశాల కోసం తాను కూడా కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదుర్కొన్నట్టు గతంలో సంచలన వ్యాఖ్యలు చేసింది.

కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదని అన్ని రంగాల్లోనూ ఉందని… అయితే సెలబ్రిటీలు తరచూ తెరపై కనిపిస్తుండడంతో ఎక్కువగా వారి గురించే కాస్టింగ్ కౌచ్‌ విషయాలు బయటకు వస్తూ ఉంటాయని రమ్యకృష్ణ చెప్పింది. ఇక ప్రస్తుత జనరేషన్‌లో మహిళలు వేరే చోట్ల పని చేయాలంటే కొన్ని అడ్జ‌స్మెంట్లు త‌ప్పవని.. సినిమా ఇండస్ట్రీలో కూడా కొందరు దర్శక నిర్మాతలు, హీరోయిన్ల‌ను వేధించడం ఎప్పటినుంచో ఉందని రమ్యకృష్ణ సంచలన‌ వ్యాఖ్యలు చేసింది.

అలాగే కొందరు దర్శక, నిర్మాతలు తాము చెప్పినట్టు చేస్తే హీరోయిన్‌ల‌కు మంచి ఛాన్స్‌లు ఇవ్వడంతో పాటు సకల సౌకర్యాలు కల్పిస్తారని కూడా ఆమె బాంబు పేల్చింది. అయితే అందరి నటీమణులు దర్శక నిర్మాత‌లు చెప్పిన‌ట్టు లొంగ‌ర‌ని కూడా ఆమె తెలిపింది. అయితే రమ్యకృష్ణ చేసిన కాస్టింగ్ కౌచ్ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ఓ సీనియర్, అగ్ర దర్శకుడును టార్గెట్ గా చేసుకుని చేసినవే అన్న గుసగుసలు అయితే అప్పట్లో వినిపించాయి. రమ్యకృష్ణ ఆ సీనియర్ డైరెక్ట్ చేసిన సినిమాలలో నటించింది. ఆ డైరెక్టర్ నుంచే ఆమె ఈ తరహా వేధింపులు ఎదుర్కొందని… అయితే ఆమె ఈ విషయాన్ని త‌న భ‌ర్త కృష్ణ‌వంశీకి కూడా చెప్పిందని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news