Moviesకృతిశెట్టిని ఇంత దారుణంగా వాడుతున్నా తట్టుకుంటుందంటే పాపం..!

కృతిశెట్టిని ఇంత దారుణంగా వాడుతున్నా తట్టుకుంటుందంటే పాపం..!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పగలు రాత్రి అనే తేడా లేకుండా వరుస షెడ్యూల్స్‌తో వాడుతున్న హీరోయిన్ కృతి శెట్టి. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా వెలుగుతున్న భాంలు పూజా హెగ్డే, రష్మిక మందన్నల తర్వాత అంతే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న యంగ్ బ్యూటీ కృతిశెట్టి. కుర్ర హీరోలందరూ ఈ బ్యూటీనే కావాలనుకుంటున్నారు. దర్శకనిర్మాతలకీ తమ సినిమాలలో కృతి ఉండాలని కోరుకుంటున్నారు. మొదటి సినిమా ఉప్పెన రిలీజ్ కాక‌ముందే మూడు సినిమాలలో హీరోయిన్‌గా కమిటైన కృతిశెట్టి..ఈ సినిమా రిలీజైయ్యాక మరో నాలుగు సినిమాలకు సైన్ చేసింది.

అయితే, ఇలా వరుసగా సినిమాలు చేస్తున్న కృతికి మొదటి మూడు సినిమాలు హిట్‌గా నిలిచాయి. కానీ, ఆ తర్వాత ది వారియర్, మాచర్ల నియోజక వర్గం సినిమాలు మాత్రం ఫ్లాప్‌గా మిగిలాయి. దాంతో కాస్త కృతి క్రేజ్ తగ్గుతుందనుకున్నారు. కానీ, కొత్త సినిమాలను కమిటవుతూ షాకిస్తోంది. వాస్తవంగా అయితే, అమ్మడు మొదటి సినిమా అవకాశం రావడానికి చాలానే కష్టపడిందట. చాలా సినిమా ఆఫీసుల చుట్టూ కూడా తిరిగిందని ఇంటర్‌నల్ టాక్ కూడా ఉంది. స్వయంగా కృతి తల్లి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని దర్శక, నిర్మాతలను రిక్వెస్ట్ చేసిందట.

కానీ, ఇప్పుడు సీన్ రివర్స్. కృతి డేట్స్ కావాలని మేకర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆమె డేట్స్ కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారంటే తన క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, కృతి ఓ యంగ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తుందనీ టాక్ వినిపిస్తోంది. ఆ హీరో ఎవరో తెలియదు గానీ, కాస్త ఖాళీ సమయం దొరికినా కూడా అతనితో డిన్నర్లు, షికార్లకి వెళుతుందట. ఇది నమ్మడానికి కాస్త కష్టమే. ఎందుకంటే కృతి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో తినడానికి నిద్రపోవడానికే టైం దొరకడం లేదు. ఎప్పుడు ఎవరొచ్చి టైం అడుగుతారో చెప్పలేము.

అంతగా వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఈ రకంగానే కాస్త ఖాళీ దొరికితే తను కమిటైన దర్శకనిర్మాతలే తెగ వాడేస్తున్నారు. ఇలాంటి టైట్ షెడ్యూల్‌లో పనిగట్టుకొని మళ్ళీ డిన్నర్, షికార్లకి అంటూ తిరిగే సమయం ఉందా అనేది డౌటే. ఈ రకంగానే అమ్మడిని బాగా వాడుతున్నారు. ఇక ఆ వాడకానికి ఎక్కడ సమయం ఉందో అనేది ఊహించుకుంటున్న వారికే తెలియాలి. కృతి అందానికి, టాలెంట్‌కి ఇప్పట్లో క్రేజ్ తగ్గడం కష్టం. ఒక్క పాన్ ఇండియా హిట్ పడితే, అప్పుడు మన వాళ్ళ వాడకం ఇంకో లెవల్‌లో ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news