Moviesలైగ‌ర్ ప్లాప్‌తో క‌ష్టాల్లో ఉన్న విజ‌య్‌ను మ‌రింత ఇబ్బంది పెడుతోన్న స‌మంత‌......

లైగ‌ర్ ప్లాప్‌తో క‌ష్టాల్లో ఉన్న విజ‌య్‌ను మ‌రింత ఇబ్బంది పెడుతోన్న స‌మంత‌… ఖుషి షూటింగ్‌లో ఏం జ‌రుగుతోంది…!

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్‌గా లైగ‌ర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయ్యింది. లైగర్ ప్లాప్ షాక్ లో ఉన్న విజయ్ దేవరకొండ పూరి దర్శకత్వంలోనే నటించాల్సిన మరో సినిమా జనగణమనను ఆపేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే జ‌న‌గ‌న‌మ‌ణ ఫ‌స్ట్ షెడ్యూల్ కూడా పూర్త‌య్యింద‌ని.. ఇందుకోసం ఇప్ప‌టికే రు. 5 కోట్లు కూడా ఖ‌ర్చు పెట్టార‌ని అంటున్నారు.

ఇక ప్రస్తుతం విజయ్ యంగ్ డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా సమంత నటిస్తోంది. అయితే గత కొద్దిరోజులుగా సమంత స్కిన్ ప్రాబ్లం మీద ఇండస్ట్రీలో అనేక రకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. అస‌లు స‌మంత స్కిన్ ప్రాబ్ల‌మ్ వార్తలు సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు సినిమాకు ముందు నుంచే ఉన్నాయి. ఆమె వాడుతున్న మందులు పడకపోవడంతో స్కిన్ సమస్య వచ్చిందని ప్రస్తుతం ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుందని.. దాదాపు నెల రోజులపాటు ఆమె షూటింగుల‌కు విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుందన్న పుకార్లు అయితే వస్తున్నాయి.

అయితే వీటిని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత ప్రస్తుతం సైలెంట్ గానే ఉంది. సమంత షూటింగ్‌కు రాకపోవడంతో ఖుషి సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేస్తామని ప్రకటించారు అయితే సమంత షూటింగుకు డుమ్మా కొట్టడంతో ఖుషి సినిమా వచ్చే సమ్మర్ కు వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అసలే విజయ్ దేవరకొండ లైగ‌ర్ ప్లాప్ అవ్వ‌డంతో నిరాశలో ఉన్నాడు.

ఈ ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టాలని ఆశతో ఉన్న విజ‌య్‌కు ఇప్పుడు సమంత వల్ల ఇబ్బంది తప్పడం లేదని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఈ ఏడాది విజయ ఖాతాలో హిట్ సినిమా కష్టంగానే కనిపిస్తోంది. మరి సమంత ఎప్పుడు ? ఈ స్కిన్ డిసీజ్ నుంచి బయటపడి సెట్స్ లోకి వస్తుందో ? అప్పుడే ఖుషి సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news