Moviesమెగాస్టార్ చిరంజీవి - బాబి సినిమా టైటిల్ మారింది.. కొత్త టైటిల్...

మెగాస్టార్ చిరంజీవి – బాబి సినిమా టైటిల్ మారింది.. కొత్త టైటిల్ ఇదే..!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి వ‌రుస పెట్టి సినిమాలు లైన్లో పెడుతున్నారు. ప్ర‌స్తుతం త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా ఫినిష్ చేసిన చిరు.. ఇప్పుడు వ‌రుస‌గా భోళాశంక‌ర్ – గాడ్‌ఫాద‌ర్ సినిమాలు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌తో జై ల‌వ‌కుశ‌, వెంకీతో వెంకీమామ సినిమాలు చేసిన కేఎస్‌. ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కంప్లీట్ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

మ‌ళ్లీ వింటేజ్ మెగాస్టార్‌ను గుర్తు చేసేలా ఈ సినిమా క‌థ‌ను ద‌ర్శ‌కుడు బాబి డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా విష‌యంలో ద‌ర్శ‌కుడు బాబి ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్‌గానే ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నారు. మెగాస్టార్ అభిమాని అయిన బాబి.. అదే మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావ‌డంతో ఆనందంతో త‌బ్బిఉబ్బ‌వుతున్నాడు.

ఇక ఈ సినిమాకు సాలిడ్ టైటిల్ ఫిక్స్ చేశార‌ట మేక‌ర్స్‌. ముందుగా ఈ సినిమాకు వాల్తేరు వీర‌య్య అన్న టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు చిరు చేసే రోల్‌కు ప‌ర్‌ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యేలా మ‌రో టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా యూనిట్ వ‌ర్గాలు, మెగా కాంపౌండ్ పీఆర్ టీం నుంచి వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకు వాల్తేరు మొన‌గాడు టైటిల్ పెట్టిన‌ట్టు టాక్ ?

ఈ త‌ర‌హా మాస్ టైటిల్స్ చిరుకు బాగా యాప్ట్ అవుతాయి. మ‌రి ఈ టైటిల్‌తో చిరు వ‌స్తే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆయ‌న అభిమానులు, మాస్ జ‌నాల దుమ్ము రేగిపోవ‌డం ఖాయం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news