Moviesనంద‌మూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌... బాల‌య్య 107 రిలీజ్ డేట్ ఫిక్స్‌..!

నంద‌మూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌… బాల‌య్య 107 రిలీజ్ డేట్ ఫిక్స్‌..!

యువ‌ర‌త్న‌, నందమూరి నటసింహం బాలకృష్ణ జోరు ఇప్పుడు మామూలుగా లేదు. అటు మీడియాలోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోను బాల‌య్య బాగా ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయాడు. బాల‌య్య ఏం చేసినా వైర‌ల్ అవుతూనే ఉంది. అఖండ త‌ర్వాత బాల‌య్య క్రేజ్‌, మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అఖండ గ‌ర్జ‌న బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇంకా ఎంతో కొంత కంటిన్యూ అవుతూనే ఉంది. అఖండ తాజాగా 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే రు. 200 కోట్ల వ‌సూళ్లు కూడా కొల్ల‌గొట్టింది.

ఇదిలా ఉంటే ఇటు బాల‌య్య హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే సైతం టాప్ వ్యూస్‌, టాప్ రేటింగ్‌ల‌తో గ‌ర్జిస్తోంది. ఈ షో ఎపిసోడ్స్ అన్ని కలిపి ఇప్ప‌టికే 40 కోట్ల నిమిషాల పాటు వీక్షించారు. ఇదో అరుదైన రికార్డు. ఈ వ‌య‌స్సులో బాల‌య్య‌కు వ‌స్తోన్న ఈ రేంజ్ క్రేజ్ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో పాటు ఇండ‌స్ట్రీ బ‌య‌ట కూడా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అఖండ‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న బాల‌య్య వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.

ఈ క్ర‌మంలోనే బాల‌య్య నెక్ట్స్ 107వ ప్రాజెక్టు మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీస్ వాళ్లు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించే ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌. కోలీవుడ్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తోంది. థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో సిరిసిల్ల‌లో ముందుగా షూటింగ్ స్టార్ట్ అవుతోంది. ఈ నెల 16 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ద‌ర్శ‌కుడు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో మ‌ళ‌యాళ హీరో దునియా విజ‌య్ ప‌వ‌ర్ ఫుల్‌గా విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇటు బాల‌య్య ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమా రిలీజ్ గురించి ఓ గుడ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ యేడాది ద‌స‌రాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మ‌లినేని గోపీచంద్ ద‌స‌రా రిలీజ్ టార్గెట్గా షూటింగ్ ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news