Moviesబాల‌య్య‌ను అలా పిలిస్తే కోపమా... ఇలా పిలిస్తే ఎంతో ముద్దంటా..!

బాల‌య్య‌ను అలా పిలిస్తే కోపమా… ఇలా పిలిస్తే ఎంతో ముద్దంటా..!

ఈ త‌రం స్టార్ హీరోల్లో చాలా మంది వెండితెర‌ను ఏలేశారు. వెండితెర‌పై ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించ‌డంతో పాటు ద‌శాబ్దాల పాటు ఇండ‌స్ట్రీని ఏలేశారు.. ఏలేస్తున్నారు. అయితే ఈ స్టార్ హీరోలు బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు మాత్రం హోస్టులుగా ఫెయిల్ అయ్యారు. కొన్ని షోల‌కు క్లిక్ అయిన స్టార్ హీరోలు, కొన్ని షోల‌కు అంత‌గా క్లిక్ కాలేదు. అయితే సీనియ‌ర్ హీరో బాల‌య్య టాక్ షోల‌కే స‌రికొత్త భాష్యం చెప్పేలా అన్‌స్టాప‌బుల్ షోను హోస్ట్ చేశారు.

ఇప్ప‌టికే 40 కోట్ల నిమిషాలు వీక్షించిన టాక్ షోగా అన్‌స్టాప‌బుల్ రికార్డుల‌కు ఎక్కింది. ఆహా ఓటీటీకి ఊహించ‌ని రేంజ్‌లో.. అస‌లు వాళ్లే క‌నివినీ ఎరుగ‌ని రీతిలో స‌బ్‌స్క్రైబ‌ర్లు పెరిగేందుకు బాల‌య్య టాక్ షోయే కార‌ణం అని చెప్పాలి. ఐఎండీబీ రేటింగ్‌లో సైతం ఈ షోకు తిరుగులేని రేటింగ్ వ‌చ్చింది. ఆహా ఫ‌స్ట్ సీజ‌న్ చాలా స‌క్సెస్ అయ్యింది. దీంతో ఇప్పుడు సెకండ్ సీజ‌న్ కూడా స్టార్ట్ కానుంది. జూలై నుంచి అన్‌స్టాప‌బుల్ సెకండ్ సీజ‌న్ స్టార్ట్ అవుతుంద‌ని ఆహా టీం క్లారిటీ కూడా ఇచ్చింది.

ఈ షో ద్వారానే బాల‌య్య సెల‌బ్రిటీల‌కు సంబంధించిన ప‌లు ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు ప్రేక్ష‌కుల‌కు తెలిసేలా చేశారు. సెల‌బ్రిటీల‌కు సంబంధించి ఎన్నో సీక్రెట్లు బాల‌య్య షో ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఈ షో నిర్వాహ‌కులు బాల‌య్య‌తో నెవ‌ర్ హావ్ ఐ ఎవ‌ర్ అనే కాన్పెఫ్ట్ తీసుకుని కొన్ని ప్ర‌శ్న‌లు వేశారు. ఈ షోలో బాల‌య్య తాను కాలేజ్‌కు బంక్ కొట్టాన‌ని.. అస‌లు బంక్ ఎవ‌రూ చేయ‌ర‌ని ప్ర‌శ్నించారు.

క‌రోనా టైంలో లెజెండ్ గురించి వ‌చ్చిన మీమ్స్ త‌న‌ను బాగా ఆక‌ట్టుకున్నాయ‌ని చెప్పారు. త‌న‌ను ఎవ‌రైనా తాత‌య్యా అని పిలిస్తే.. అస్సులు న‌చ్చ‌ద‌ని.. త‌న‌ను బాలా అని పిలిస్తే ముద్దుగా బాగుంటుంద‌ని బాల‌య్య చెప్పారు. నో తాతా. నో గ్రాండ్ పా అని బాల‌య్య చెప్పారు. ఇక ప్ర‌స్తుతం బాల‌య్య మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్‌లో త‌న 107వ సినిమాలో న‌టిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news