Movies"రాధేశ్యామ్" సెట్స్ నుండి ఫోటో లీక్..నెట్టింట వైరల్..!!

“రాధేశ్యామ్” సెట్స్ నుండి ఫోటో లీక్..నెట్టింట వైరల్..!!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ “రాధేశ్యామ్” సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. జిల్ ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. పీరియాడిక‌ల్ స్టోరీగా ల‌వ్ + యాక్ష‌న్ అంశాల‌తో తెర‌కెక్కే ఈ సినిమాను యూవీ క్రియేష‌న్స్‌తో పాటు ప్ర‌భాస్ సొంత బ్యాన‌ర్ అయిన గోపీకృష్ణా మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కొన్ని సంవ‌త్స‌రాల క్రితం యూర‌ప్‌లో జ‌రిగిన ఓ య‌దార్థ ప్రేమ‌క‌థ‌కు కొన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాలు జోడీంచి ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ను తెర‌కెక్కిస్తున్నాడ‌ని టాక్‌. ఇక ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలు ఉన్నాయి. రాధేశ్యామ్ నుండి వచ్చిన మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో ఇప్పటికీ రికార్డులను తిరగరాస్తుంది. ఇది ఒకవిధంగా ప్రభాస్ మేనియాకు అద్దంపట్టేదిగా చెప్పుకుంటున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇప్పటికే ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ‘రాధేశ్యామ్‌’ ప్ర‌స్తుత షెడ్యూల్‌ కడప జిల్లాలోని గండికోటలో షూటింగ్‌ జరుగుతోంది.

గండికోటలో షూటింగ్ లో ప్రభాస్, పూజాహెగ్డేతో పాటు మరో ముఖ్య నటుడు సత్యరాజ్ కూడా పాల్గొన్నాడు. గండికోటలో రాధేశ్యామ్ షూటింగ్ జరుగుతుందన్న సమాచారంతో ప్రజలు అక్కడికి చేరుకోగా కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ప్రభాస్..రాధేశ్యామ్‌తో పాటు సలార్, ఆదిపురుష్ సినిమాలు నటిస్తున్నాడు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news