Moviesదేవర కోసం ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..? పెట్టకుండా బ్రతికించేసాడు...

దేవర కోసం ముందు అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..? పెట్టకుండా బ్రతికించేసాడు కొరటాల శివ..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాలు ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటూ ఉంటాయి . మరి ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే అభిమానులకి చాలా చాలా ఇష్టం. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే .

ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్డేట్ రిలీజ్ అయినా సరే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఊహించుకుంటూ ఉంటారు . అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన రీసెంట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. దేవర సినిమాకు ముందుగా కొరటాల శివ “నాయర్” అనే టైటిల్ ని పెట్టాలి అని అనుకున్నారట .

కానీ ఈ టైటిల్ అంతగా రీచ్ అవ్వదు అంటూ భావించిన ఎన్టీఆర్ మరో కొత్త టైటిల్ పెడదాము అంటూ ఆలోచన చేశారట . ఫైనల్లీ కొన్ని పేర్లు అనుకుంటున్నా మూమెంట్లో లక్ష్మీ ప్రణతి ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ని ఓకే చేసిందట. దేవర కూడా బాగా సెట్ అవుతుంది అంటూ కొరటాల ఫైనల్లీ దేవర అనే టైటిల్ ని ఓకే చేశారట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు . ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నాడు వార్ 2 సినిమా సెట్స్ లో పాల్గొంటున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news