Moviesఈ బ్యూటీ మూవీస్ లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా.. అసలు...

ఈ బ్యూటీ మూవీస్ లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా.. అసలు నమ్మలేరు..!!

నివేదా పేతురాజ్‌.. ఈ పేరు చెప్పితే పెద్దగా గుర్తు పట్టలేకపోవచ్చు కానీ ‘రెడ్‌’ సినిమాలో హీరోయిన్ అంటే టక్కున గుర్తు పట్టేస్తారు. కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది నివేదా పేతురాజ్‌. ఈ ఏడాది సంక్రాంతికి ‘రెడ్‌’ సినిమాతో సందడి చేసిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా ‘పాగల్’ మూవీతో ప్రేక్షకుల మనసు దోచుకుంది.

మెంటల్ మదిలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు..చాలా తక్కువ టైంలోనే సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా.. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఎంచుకుని..ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు వేయించుకుంది.

అమ్మడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ.. నిత్యం తన అభిమానులతో టచ్ లో ఇంటుంది. ఇక ఈ అమ్మడుకి కోలీవుడ్ పరిశ్రమలో నటిగా అద్దిరిపోయే క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఈ భామ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా..??

నివేదా పేతురాజ్‌ మూవీస్ లోకి రాకముందు బోటిక్ నిర్వహించేది. అంతేకాకుండా ఈవెంట్స్ కార్ల కంపెనీ లో కూడ పని చేసిందట. ఆ సమయంలోనే కొంతమంది స్నేహితులు సినిమాల్లో ట్రై చేయమని చెప్పితే..అలా ప్రయత్నించి ఇలా హీరోయిన్ అయ్యిందట. ఒకవేళ సినిమాల్లోకి రాకుండా ఉంటే యోగా ఇన్‌ స్ట్రక్టర్‌ అయ్యేదాన్ని అని చెప్తుంది ఈ పాగల్ బ్యూటీ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news