Moviesఆ హీరోపై ప్రేమ‌తో థ‌మ‌న్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌... మ్యాట‌ర్ ఇదే...!

ఆ హీరోపై ప్రేమ‌తో థ‌మ‌న్ ఎమోష‌న‌ల్ ట్వీట్‌… మ్యాట‌ర్ ఇదే…!

మెగా మేనళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ వ‌రుస ప్లాపుల త‌ర్వాత చిత్ర‌ల‌హ‌రి, ప్ర‌తిరోజు పండ‌గే సినిమాల‌తో కాస్త ట్రాక్‌లోకి వ‌చ్చాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌న్న క‌సితో సాయి సుబ్బు ద‌ర్శ‌క‌త్వంలో సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇటీవ‌ల రిలీజ్ చేసిన నో పెళ్లి అనే ఫ‌స్ట్ సింగిల్ దుమ్మురేపేలా వైర‌ల్ అవ్వ‌డంతో పాటు సినిమాపై మంచి అంచ‌నాలు తీసుకువ‌చ్చింది. రానా, వ‌రుణ్ తేజ్ కూడా ఈ సాంగ్‌ను బాగా ప్ర‌మోట్ చేశారు.

Thaman Movies back To Back Ready to Release

ఇక ఇప్పుడు రెండో సాంగ్ కోసం సాయి వేసిన ఎత్తు ఇప్పుడు ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉంది. ఇటీవ‌ల సాయికి పెళ్లి కుదిరింద‌ని.. పెళ్లికి రెడీ అయిపోయాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇదంతా సోలో బ‌తుకు సినిమాలోని సెకండ్ సాంగ్ ప్ర‌మోష‌న్ కోసం వేస్తోన్న ఎత్తు అట‌. ఈ రోజు ఉద‌యం 10 గంట‌ల‌కు ఈ సెకండ్ సాంగ్ రిలీజ్ అవుతోంది. ఈ క్ర‌మంలోనే థ‌మ‌న్ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశాడు. సాయిధ‌ర‌మ్ తేజ్‌పై త‌న‌కున్న ప్రేమ‌ను తెలియ‌జేస్తూ ఎమోష‌న‌ల్ ట్వీట్ కూడా చేశాడు.

 

ఈ సాంగ్‌ను “నా ప్రాణం పెట్టి చేశాను.. సాయి ధరమ్ తేజ్ పట్ల నాకున్న ప్రేమ, నమ్మకానికి ప్రతిరూపంలా ఈ పాట ఉంటుంది. హే ఇది నేనేనా అనే పాట మీ అందరికీ పిచ్చెక్కిస్తుంది” అని చెప్పుకొచ్చారు. మరి తొలి సాంగ్‌తోనే సినిమాపై అంచ‌నాలు పెంచేసిన థ‌మ‌న్‌.. రెండో సాంగ్ సినిమాను ఏ రేంజ్‌కు తీసుకు వెళ‌తాడో చూడాలి. ఏదేమైనా థ‌మ‌న్ అల వైకుంఠ‌పుర‌ములో త‌ర్వాత ఫుల్ స్వింగ్‌లోనే ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news