Gossipsసుశాంత్ ల‌వ‌ర్ రియా జైలుకే.. డ్ర‌గ్స్ లింకుల్లో సాక్ష్యాల‌తో బుక్ అయిన‌ట్టే...!

సుశాంత్ ల‌వ‌ర్ రియా జైలుకే.. డ్ర‌గ్స్ లింకుల్లో సాక్ష్యాల‌తో బుక్ అయిన‌ట్టే…!

దివంగ‌త బాలీవుడ్ న‌టుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసులో రోజుకో కొత్త విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఇక అంద‌రి అనుమానాలు, అన్ని వేళ్లు సుశాంత్ ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తివైపే ఉన్న వేళ ఇప్పుడు ఆమె గురించి కూడా అనేక అనుమానాలు వ‌స్తున్నాయి. తాజాగా రియా చక్రవర్తికి డ్రగ్స్ మరియు నార్కోటిక్స్ తో లింకులు ఉన్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక సుశాంత్ మృతి చెందాక జాతీయ మీడియాలో త‌న‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాకుండా పాజిటివ్ క‌థ‌నాలు వ‌చ్చేలా త‌న పీఆర్ టీంతో భారీగా డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి మ‌రీ ప్లాన్ చేసింద‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Riya Chakraborty move SC seeking transfer of investigation in ...

ఇక ఇప్పుడు ఈ కేసులో ఏకంగా డ్ర‌గ్స్ అంశం కూడా ఉన్న‌ట్టు బ‌య‌ట‌కు రావ‌డం మ‌రింత ఉత్కంఠ రేపుతోంది. రియాకు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాల‌తో లింకులు ఉన్నాయ‌ని.. ఓ సాక్షి ఈడీకి చెప్పిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే క‌నుక నిజం అయ్యి.. ప‌క్కా ఆధారాలు ఉంటే రియాకు ఖ‌చ్చితంగా జైలు శిక్ష ఉంటుంద‌ని.. ఆమె జైలు ఊచ‌లు లెక్క పెట్టాల్సిందే అని నిపుణులు చెపుతున్నారు. గ‌తంలో సుశాంత్ ఇంట్లో ప‌నిచేసిన నీర‌జ్‌సింగ్ రియాతో క‌లిసి సుశాంత్ త‌ర‌చూ గంజాయి సిగ‌రెట్స్ తీసుకునేవాడ‌ని కూడా మీడియాలో వ‌చ్చింది.

Sushant Singh Rajput case Riya Chakraborty may arrest without ...

ఇక రియాకు ఈ డ్ర‌గ్ మాఫియాకు ఉన్న లింకులేంటి ? ఈ కోణంలో కూడా సీబీఐ అధికారులు ఆమెను విచారించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఏదేమైనా రియాను అన్ని విధాలా విచారిస్తోన్న అధికారులు ఇప్పుడు మ‌రిన్ని కోణాల్లో ఆమెను లోతుగా విచారించ‌డం ఖాయంగా ఉంది. ఏదేమైనా రోజు రోజుకు రియా చుట్టూ కొత్త ఉచ్చులు బిగుస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news