Gossipsర‌జ‌నీకాంత్ సినిమాలో తెలుగు హీరో... ఇద్ద‌రు ఆంటీ హీరోయిన్లు కూడా...!

ర‌జ‌నీకాంత్ సినిమాలో తెలుగు హీరో… ఇద్ద‌రు ఆంటీ హీరోయిన్లు కూడా…!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా విశ్వాసం ఫేమ్ శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో గోపీచంద్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడంటూ నిన్న‌టి వ‌ర‌కు వార్త‌లు వ‌చ్చాయి. గోపీచంద్ హీరోగా తెర‌కెక్కిన శంఖం, శౌర్యం సినిమాల‌కు శివే ద‌ర్శ‌కుడు. అందుకే ఆ ప‌రిచ‌యంతోనే ర‌జ‌నీకాంత్ సినిమాలో గోపీచంద్‌ను న‌టింప‌జేయ‌నున్న‌ట్టు నిన్న‌టి వ‌ర‌కు పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటించబోతున్నాడ‌ట‌.

రజనీకాంత్ ఇంట్లో బాంబు కలకలం

ఇటీవ‌ల కాలంలో ర‌జ‌నీకి స‌రైన హిట్లు లేవు. అందుకే ఈ సినిమా పై రజనీ అభిమానులు భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. మాస్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు శివ‌ది ప్ర‌త్యేక‌మైన శైలీ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. శివ – అజిత్ కాంబినేష‌న్ అంటే బాక్సాఫీస్ బ‌ద్ద‌లైపోవాల్సిందే. థియేట‌ర్ల‌లో విజిల్స్ మోగాల్సిందే.

 

వీరి కాంబోలో వ‌చ్చిన వీరం – వివేగం – వేదాళం – విశ్వాసం సినిమాలు ఏ స్థాయిలో క్లాస్‌, మాస్ ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించాయో చూశాం. ఇప్పుడు ఈ సినిమాతో ర‌జ‌నీలో ఉన్న మాస్ హీరోయిజాన్ని ఓ రేంజ్‌లో ఎలివేట్ చేసేలా శివ క‌థ రాసుకున్నాడ‌ట‌. ఇక ఈ సినిమాలో మాజీ హీరోయిన్లు ఖుష్బూ, మీనా రజిని సరసన న‌టిస్తోన్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news