Gossipsప‌వ‌న్ ప‌క్క‌న ఆ హాట్ హీరోయిన్‌... ఇక అందాల ఆర‌బోతే...!

ప‌వ‌న్ ప‌క్క‌న ఆ హాట్ హీరోయిన్‌… ఇక అందాల ఆర‌బోతే…!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తోన్న వ‌కీల్‌సాబ్ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే క్రిష్ సినిమాను చేస్తాడు. క్రిష్ – ప‌వ‌న్ సినిమా పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌నుంద‌ట‌. జాక్వాలైన్ ఫెర్నాండెజ్ ఈ సినిమాలో హీరోయిన్ అంటున్నారు. ఈ సినిమాకు విరూపాక్ష, గజదొంగ, బందిపోటు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే ప‌వ‌న్ హ‌రీష్ శంక‌ర్ సినిమాను చేయ‌నున్నాడు.

 

గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన గ‌బ్బ‌ర్‌సింగ్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు హ‌రీష్ ప‌వ‌న్ కోసం మ‌రోసారి గ‌బ్బ‌ర్‌సింగ్ రేంజ్ స్టోరీ రాస్తున్నాడు. గ‌బ్బ‌ర్‌సింగ్‌ను మించే సినిమాను తీస్తాన‌ని హ‌రీష్ అంటున్నా… అది గ‌బ్బ‌ర్‌సింగ్‌కు సీక్వెలా ? కాదా ? అన్న‌ది చెప్ప‌లేదు. అభిమానులు మాత్రం ఇది ఖ‌చ్చితంగా గ‌బ్బ‌ర్‌సింగ్ -2 అని ఫిక్సైపోయారు. ఈ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపిస్తారట.

 

ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతీహాస‌న్ న‌టిస్తుంద‌ని ముందు వార్త‌లు రాగా.. ఇప్పుడు ఈ ప్లేస్‌లో పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసిందంటున్నారు. పూజా హ‌రీష్ డైరెక్ట్ చేసిన గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌లో న‌టించింది. ఇప్పుడు ప‌వ‌న్ సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాల‌ని హ‌రీష్ ఫిక్స‌య్యాడంటున్నారు. పూజా లాంటి అందాల ఆర‌బోసే.. తొడ‌లు చూపించే సుంద‌రి సినిమాలో ఉంటే గ్లామ‌ర‌సం ఎలా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news