Gossipsఆచార్య మోష‌న్ పోస్ట‌ర్ కాపీయేనా... అక్క‌డ నుంచే ఎత్తేశారా..!

ఆచార్య మోష‌న్ పోస్ట‌ర్ కాపీయేనా… అక్క‌డ నుంచే ఎత్తేశారా..!

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌. తాజాగా ఆచార్య టైటిల్ రివీల్ కావ‌డంతో మోష‌న్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ల పై ఆచార్య‌ను నిరంజన్ రెడ్డి, రాంచరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇక తాజాగా చిరు పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆచార్య మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్ట‌ర్‌లో చిరు చాలా యంగ్‌గా క‌నిపిస్తున్నారు. ఇక సోష‌ల్ మీడియాలోనూ ఈ మోష‌న్ పోస్ట‌ర్ జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇక కొంత మంది మాత్రం ఆచార్య మోష‌న్ పోస్ట‌ర్ కాపీ అని ప్ర‌చారం చేస్తున్నారు. కన్నెగంటి అనిల్ కృష్ణ రచించిన పుణ్యభూమి నవల ఆధారంగా ఈ పోస్టర్ ఉందన్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. పుణ్య‌భూమికి ధ‌ర్మ‌స్థ‌లికి లింక్ ఉంద‌నేలా ఆరోప‌ణ‌లు కూడా వ‌స్తున్నాయి.

ఇక ఈ ఆరోప‌ణ‌లు ఎలా ఉన్నా ఇటీవ‌ల కాలంలో ఏ పెద్ద సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ అయినా కూడా యాంటీ ఫ్యాన్స్ నుంచి ఎక్కువుగా ఇలాంటి కాపీ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇక ఆచార్య సినిమాలో చిరు న‌క్స‌లైట్ పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌న్న ప్ర‌చారం కూడా ఉంది. స్వ‌ర‌బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకు స్వ‌రాలు అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news