Movies"నువ్వు హీరోగా పనికిరావు"..ముఖం మీదనే చెప్పేసిన హీరో సూర్య.. ఏం డేర్...

“నువ్వు హీరోగా పనికిరావు”..ముఖం మీదనే చెప్పేసిన హీరో సూర్య.. ఏం డేర్ రా బాబు..!

ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసే హీరోలు చాలా చాలా తక్కువ . మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు అలా మాట్లాడలేరు ..ఏం మాట్లాడితే ఏ తలనొప్పి వస్తుందో ..? ఏ విధంగా ట్రోలింగ్కి గురవుతాము..? ఎవరు ఏ మూల నుంచి ఏ పుల్ల పెడతారు..? మనకెందుకురా బాబు అంటూ సైలెంట్ గా గుట్టుచప్పుడు కాకుండా తమ పని తాము చేసుకునే హీరోలే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం .

అయితే వాళ్లందరి లోకి చాలా చాలా డిఫరెంట్ సూర్య . నచ్చితే చేస్తాడు.. నచ్చకపోతే చేయడు. ఇష్టం ఉంటేనే మాట్లాడుతాడు . ఇష్టం లేకపోతే అస్సలు వాటి జోలికి పోడు . యాక్టింగ్ నచ్చిందా..? ఓకే గుడ్ అంటూ పొగుడుతారు.. నచ్చలేదా నీలో ఆ సత్తా లేదు అంటూ తేల్చి చెప్పేస్తాడు. కుదిరితే నాలుగు సజెషన్స్ ఇస్తాడు . ఇలాగే మన తెలుగు హీరోకి కూడా సజెషన్స్ ఇచ్చాడు సూర్య . ఆ విషయాన్ని ఓ ఈవెంట్లో ఆ స్టార్ హీరో బయటపెట్టడం అప్పట్లో సంచలనంగా మారింది.ఆ హీరో మరెవరో కాదు రానా దగ్గుబాటి .

రానా దగ్గుబాటి నటించిన ఒక సినిమాను రివ్యూ చూశాడు సూర్య . అదే మూమెంట్లో సూర్య ఓపెన్ గా “ఇలా అయితే నువ్వు ఇండస్ట్రీకి సెట్ కావు హీరోగా ఎదగాలంటే చాలా చాలా నేర్చుకోవాలి “అంటూ సజెస్ట్ చేశారట . కారులో గంటసేపు పాటు రౌండ్స్ వేస్తూ క్లాస్ పీకాడట. ఇదే విషయాన్ని రానా దగ్గుబాటి ఓ ఈవెంట్లో ఓపెన్ గా చెప్పేసాడు . ఆశ్చర్యమేంటంటే రానా దగ్గుబాటి చెబుతున్నప్పుడు హీరో సూర్య పక్కన ఉండి ఆపడానికి ప్రయత్నిస్తాడు. దీనికి సంబంధించిన వార్త మరొకసారి నెట్టింట వైరల్ గా మారడంతో ఇప్పుడు జనాలు ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news