Moviesఆ రోజు రాత్రి నాగచైతన్య ఆ హీరోయిన్ తోనే ఉన్నాడా..? కొత్త...

ఆ రోజు రాత్రి నాగచైతన్య ఆ హీరోయిన్ తోనే ఉన్నాడా..? కొత్త డౌట్లు పుట్టిస్తున్న సంచలన ఫొటోస్..!

నాగచైతన్య .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రెండ్ అలాగే ట్రోలింగ్ కి గురవుతున్న పేరు . అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య జోష్ సినిమాతో తనలోని సైలెన్స్ ను పరిచయం చేశాడు. ఆ తర్వాత ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తనలోని నాటి రొమాంటిక్ యాంగ్రీ యాంగిల్స్ ను బయట పెట్టాడు . నాగచైతన్య నటించిన సినిమాలు వావ్ ..సూపర్ డూపర్ హిట్ అవుతాయి అని చెప్పలేం . కానీ ఖచ్చితంగా నాగచైతన్య పర్ఫామెన్స్ ని చూసి ఎంజాయ్ చేయొచ్చు .

అది మాత్రం బాగా చెప్పగలం . అయితే ఈ మధ్యకాలంలో నాగచైతన్య శోభితా ధూళిపాల అనే హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడు అని.. ఆమెతో ఎక్కువ టైం గడుపుతున్నాడు అని ప్రచారం జరుగుతుంది . దానికి తగ్గట్టే వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే దీనిపై శోభిత ధూళిపాల స్పందిస్తూ అలాంటిది ఏదీ లేదు అంటూ కొట్టి పడేసింది . కానీ రీసెంట్గా నాగచైతన్య షేర్ చేసిన ఫోటోలోని లొకేషన్ అదేవిధంగా హీరోయిన్ శోభిత దూళిపాల షేర్ చేసిన ఫోటోలోని లొకేషన్స్ ఒకే విధంగా ఉండడంతో వీళ్ళిద్దరూ ఆరోజు కలిసే ఉన్నారు అని..

కలిసి టైం స్పెండ్ చేశారు అని .. వీళ్ళ మధ్య ప్రేమాయణం నిజమే అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . అంతేకాదు ఆరోజు శోభిత దూళిపాళ్లతోనే టైం మొత్తం గడిపాడు నాగచైతన్య అంటూ పలువురు కాన్ఫిడెంట్గా నమ్మేస్తున్నారు. దీంతో అక్కినేని ఇంటికి కాబోయే కోడలుగా శోభిత ధూళిపాల పేరుని మైండ్లో రిజిస్టర్ చేసుకుంటున్నారు పలువురు అక్కినేని ఫ్యాన్స్ . అయితే దీనిపై నాగచైతన్య అక్కినేని నాగార్జున ఇప్పటివరకు అఫీషియల్ గా స్పందించక పోవడం గమనార్హం. చూద్దాం మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో..? అక్కినేని ఇంటి కోడలుగా శోభితా ధూళిపాల అవుతుందో..? లేదా ..? ఆ ప్లేస్ లోకి వేరే ఎవరైనా వస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news