Moviesఫ్యాన్స్ కి వెరీ వెరీ బిగ్ సర్ప్రైజ్.. తండ్రి కాబోతున్న మన...

ఫ్యాన్స్ కి వెరీ వెరీ బిగ్ సర్ప్రైజ్.. తండ్రి కాబోతున్న మన తెలుగు స్టార్ హీరో..ఫోటోలు వైరల్..!!

ఇది నిజంగా ఫాన్స్ కి ఊహించిన గుడ్ న్యూస్ అని చెప్పాలి . వరుస సినిమాలతో బిజీ బిజీగా ముందుకెళుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ హీరోగా పాపులారిటీ దక్కించుకొని సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తున్న నిఖిల్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు అనే విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టాడు . కార్తికేయ 2 సినిమాతో 100 కోట్ల పాన్ ఇండియా భారీ హిట్ కొట్టి నేషనల్ వైట్ పాపులారిటీ దక్కించుకున్న నిఖిల్ ..

ఆ తర్వాత చేసిన స్పై సినిమా డిజాస్టర్ అయింది . కానీ నటన పరంగా నిఖిల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు . ప్రెసెంట్ స్వయంభు , ది ఇండియా హౌస్ , కార్తికేయ 3, చిత్రాలతో బిజీగా ఉన్నాడు నిఖిల్ . రీసెంట్ గా నిఖిల్ అభిమానులకి ఓ గుడ్ న్యూస్ వినిపించాడు. తన భార్య తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు . తన భార్యకు శ్రీమంతం జరిగిన ఫొటోస్ కూడా షేర్ చేశాడు నిఖిల్.

గతంలో ఓ ఫంక్షన్ లో బేబీ బంప్ తో కనిపించింది పల్లవి. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి . అయితే నిఖిల్ గాని.. నిఖిల్ భార్య పల్లవి కానీ దీనిపై ఏ విషయంగా స్పందించలేదు . రీసెంట్గా భార్య సీమంతంకి సంబంధించిన ఫొటోస్ ను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు నిఖిల్ . “ట్రెడిషనల్ ఇండియన్ ఫామ్ ఆఫ్ బేబీ షవర్.. మా ఫస్ట్ బేబీ త్వరలో రానుంది “అంటూ పోస్ట్ చేశారు. ” మీ అందరి ఆశీర్వాదాలు కావాలి ” అంటూ రాసుకు వచ్చాడు . దీంతో అభిమానులు పలువురు నెటిజెన్లు నిఖిల్ కి కంగ్రాట్స్ చెప్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news