Moviesరాత్రికి రాత్రి నాగార్జున సినిమా దొబ్బేసి.. సూపర్ డూపర్ హిట్ అందుకున్న...

రాత్రికి రాత్రి నాగార్జున సినిమా దొబ్బేసి.. సూపర్ డూపర్ హిట్ అందుకున్న వెంకటేశ్.. ఆ మూవీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కోసం రాసుకున్న కథను మరొక స్టార్ హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం. ఇప్పటికే ఇండస్ట్రీలో అలా చేతులు మారిన సినిమాలు ఎన్నో ఉన్నాయి . కానీ ఒక స్టార్ హీరో కోసం రాసుకున్న కధ.. ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసి ..అదే కధ మరో స్టార్ హీరో చేసి హిట్ అందుకున్న రికార్డ్స్ లో వెంకటేష్ కూడా ఉన్నాడు .సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చేది మన వెంకటేష్ .

అలాంటి ఎక్స్ప్రెషన్స్ తో ఆకట్టుకుంటాడు. కాగా గతంలో సూపర్ డూపర్ హిట్ సినిమా సంక్రాంతి మూవీను నాగార్జునకు వివరించారట డైరెక్టర్. అయితే ముగ్గురు తమ్ముళ్లకు అన్నగా అంత పెద్ద లుక్స్ లో నేను బాగోను అంటూ రిజెక్ట్ చేసారట మన నాగార్జున. అంతేకాదు ఆ తర్వాత ఇదే కథను నాగార్జుననే వెంకటేష్ తో చేస్తే బాగుంటుంది అనగా డైరెక్టర్ వెళ్ళి వెంకటేష్ కి ఈ కధ వివరించగా వెంకటేష్ ఓకే చేశారట .

అలా సంక్రాంతి సినిమా నాగార్జున చేతుల నుంచి వెంకటేష్ చేతిలోకి వెళ్లి సూపర్ డూపర్ హిట్ అయింది. ఏ మాటకు ఆ మాటే నాగార్జున కన్నా ఆ పాత్రకు వెంకటేశ బాగా సూట్ అయ్యాడు అన్న కామెంట్స్ బాగా వినిపించాయి. మొత్తానికి నాగార్జున చేయాల్సిన సినిమా వెంకటేష్ చేసి..ఆ సూపర్ డూపర్ కూల్ క్లాసిక్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అనమాట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news