Newsఅక్క పేరు చెప్పుకుని ఇలా చేస్తే ఎలా... మంగ్లీ చెల్లికి ఆ...

అక్క పేరు చెప్పుకుని ఇలా చేస్తే ఎలా… మంగ్లీ చెల్లికి ఆ టాలెంట్ లేదుగా…!

మన తెలంగాణలో పాపులర్ జానపద గాయనీ ఎవరంటే అందరూ చెప్పే పేరు మంగ్లీ. ఈమె అసలు పేరు సత్యవతి. ఓ ప్రముఖ చానెల్ లో ‘మాటకారి మంగ్లీ’ అనే ప్రోగ్రాం తో బాగా పాపులర్ అయింది. అదే మంగ్లీని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘మైక్’ టీవీ చానల్ సపోర్ట్ తో బాగా పాపులర్ అయింది. ఆ పాపులారిటీనే సినిమా పాటల రికార్డింగ్ స్టూడియో వరకూ తీసుకెళ్ళింది. రచయిత కాసర్ల శ్యామ్ కూడా మంగ్లీకి బాగా సపోర్ట్ చేశాడు.

చెప్పాలంటే మంగ్లీ ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడింది. ఇప్పుడు ఆమె ఒక సెలబ్రిటీ సింగర్. ఆ కజిన్ సిస్టర్ ఇంద్రావతి చౌహాన్ కూడా అక్క పేరు చెప్పుకొని స్టార్ సింగర్ అవ్వాలని తెగ ఆరాటపడుతోంది. కానీ, ఆమెకి భాష మీద పట్టు లేకపోవడంతో ఆశించిన స్థాయికి చేరడం లేదు. దేవీశ్రీప్రసాద్ అవకాశం ఇవ్వడం అంటే మాటలు కాదు. అది కూడా సుకుమార్, అల్లు అర్జున్ లాంటి భారీ కాంబోలో తెరకెక్కిన సినిమా.

సమంత చేసిన ఐటెం సాంగ్. ఈ సాంగ్ ఇంద్రావతి పాడటం వల్ల బాగా క్రేజ్ వచ్చిందా అంటే ముమ్మాటికీ కాదనే చెప్పాలి. ఆ క్రెడిట్ గ్యారెంటీగా డీఎస్‌పీ, సుకుమార్, సమంతలకే చెందుతుంది. అయినా ఊ అంటావా మా సాంగ్ సక్సెస్ క్రెడిట్ ఇంద్రావతికి ఇచ్చారు. ఆ తర్వాత ఈ కుర్ర సింగర్ ఏ స్థాయికో చేరుకోవాలి. కానీ, పదాల ఉచ్చరణ..లెవల్స్ సరిగ్గా తెలియడం లేదట.

అచ్చు తప్పులు పాడుతుందనే కామెంట్స్ వినిపిస్తిన్నాయి. అంతేకాదు, ఇందావతితో పాటలు పాడిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ ని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆదికేశవ సినిమాలో లీలమ్మో అనే మాస్ బీట్ ఉన్న సాంగ్ పాడింది. ఇందులో శ్రీలీల హైలెట్ అయింది. ఈ పాట క్రెడిట్ కూడా ఇంద్రావతికి దక్కడం కష్టమే అంటున్నారు. మంగ్లీ ఎంతో కష్టపడితే ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుంది. ఆ స్థాయికి ఇంద్రావతి చేరడం చాలా కష్టం అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news