News4 బ్లాక్ బస్టర్స్, 1 డిజాస్టర్..ఈ టాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ది అమ్మాయిల...

4 బ్లాక్ బస్టర్స్, 1 డిజాస్టర్..ఈ టాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ది అమ్మాయిల విష‌యంలో అంత వంక‌ర బుద్ధా..!

టాలీవుడ్‌లో ఒక‌ న‌టుడు, ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు కూడా..! అత‌డికి బంధువు అయిన ఓ స్టార్ డైరెక్ట‌ర్ గురించే ఇదంతా..! ఆయ‌న ముందు ర‌చ‌యిత‌గా మారి ఆ త‌ర్వాత దర్శకుడిగా నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన క్రేజ్. ఓ పేద్ద‌ హీరోతో ఓ భారీ డిజాస్టర్ తీసినా దాని ప్రభావం ఏమాత్రం ఆ దర్శకుడి మీద పడలేదు. కారణం ఆ పేద్ద‌ హీరోలు ఇన్వాల్వ్ అవడం వల్లే ఆ సినిమా ఫ్లాప్ అని జనాలు కూడా తప్పు పట్టలేదు.

కానీ, ఆ దర్శకుడు క్యారెక్టర్ మాత్రం హీరోయిన్స్ విషయంలో కాస్త బ్యాడ్ అని టాక్ ఉంది. ఆ దర్శకుడు తీసిన సినిమాలన్నీ సామాజిక అంశంతో పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో రూపొందినవే కావడం విశేషం. ఈ రోజు ఓ ప్ర‌ముఖ‌ పెద్ద బ్యాన‌ర్‌.. టాలీవుడ్‌లో చాలా పెద్ద పెద్ద‌ నిర్మాణ సంస్థలను తట్టుకొని నిలబడిందీ అంటే ఆ క్రెడిట్ ఖచ్చితంగా ఆ స్టార్ ద‌ర్శ‌కుడికే దక్కుతుంది.

కథా బాగా రాస్తాడనో.. లేదా గ్యారెంటీ హిట్ వ‌స్తుంద‌నో అందరూ పెద్ద స్టార్ హీరోలే ఆయ‌న‌కు అవకాశం ఇచ్చారు. అయితే ఆ డైరెక్ట‌ర్‌పై గతంలో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. నాకు ఛాన్స్ ఇస్తా అని వాడుకున్నాడంటూ శ్రీరెడ్డి వాపోయింది. ఇది ఎంతవరకూ నమ్మాలో జనాలకి అర్థం కాలేదు. కారణం ఆయన తీసిన సినిమాలు..అందులో హీరోలు. ఇలాంటి వాడికి అంత దిక్కుమాలిన ఆలోచన ఉంటుందా..? అన్న డౌట్‌..!

ఇదే చాలామంది అనుకున్నారు. కానీ, ఓ సీనియర్ నటి తన సన్నిహితుల వద్ద ఆ స్టార్ డైరెక్ట‌ర్ గురించి ఓపెన్ గా చెప్పిందట. నాకంటే చిన్నవాడు. సినిమాలో మంచి క్యారెక్టర్ ఉందని చెప్పాడు. ఆయన తీసిన సినిమాల వల్ల ఓ గౌరవం ఉంది. కానీ, నన్ను కూడా అడగ కూడాని మాట అడిగాడు. ఇతనేనా నాతో మాట్లాడుతుందీ అని షాకయ్యాను అంటూ ఆ స్టార్ డైరెక్ట‌ర్ గురించి ఆ సీనియర్ నటి చెప్పిందట. అమ్మ, అత్త పాత్రల్లో అద్భుతంగా నటించే ఆమె చాలా పాపులర్. మరి ఇది ఎంతవరకూ నమ్మాలి.. నిజంగానే ఆ స్టార్ డైరెక్ట‌ర్ అలాంటి వాడా ? అని న‌మ్మ‌లేని ప‌రిస్థితి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news