Newsఅప్పుడే ఎన్టీఆర్ పిల్ల‌లు ఇంత పెద్దోళ్లైపోయారా... చిన్న బుడ్డోడు భ‌లే ఉన్నాడ్రా...

అప్పుడే ఎన్టీఆర్ పిల్ల‌లు ఇంత పెద్దోళ్లైపోయారా… చిన్న బుడ్డోడు భ‌లే ఉన్నాడ్రా ( ఫోటోలు)

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా వరకు ప్రైవేట్ లైఫ్‌న‌కే పరిమితమవుతూ ఉంటారు. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి బయట కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. సినిమా ఫ్రెండ్స్ తో కలిసి అడపాదడపా ఆయన పార్టీలో పాల్గొంటూ ఉంటారు. సినిమాల్లో మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులు. ఇటీవల కాలంలో బన్నీ, ఎన్టీఆర్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. చాలా రోజుల తర్వాత టాలీవుడ్ సినీ సెలబ్రిటీలు అందరూ కలిసి దీపావళిని చాలా స్పెషల్ గా మార్చుకున్నారు. సినిమా ఫ్రెండ్స్ అంతా కలుసుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన అందుకు పెద్దలుగా మారారు.

రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు ఆయన సందర్భంగా దీపావళిని ప్రత్యేకంగా సెలబ్రేషన్ చేసుకున్నారు. అందుకు తమ సినిమా స్నేహితులు అందరిని ఆహ్వానించారు. ఇందులో వెంకటేష్ ఫ్యామిలీ, మహేష్ బాబు ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ పాల్గొన్నారు. అయితే ఈ దీపావళి సెలబ్రేషన్స్‌కు వచ్చిన వారిలో తారక్ ఫ్యామిలీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తన భార్య లక్ష్మీ ప్రణతి ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో స‌హా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తార‌క్ ఫ్యామిలీతో స‌హా దిగిన ఫోటో సోషల్ మీడియాలు ద్వారా పంచుకోగా అది బాగా వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో తార‌క్ కుర్తా ధరించాడు పిల్లలు అభయ్, భార్గవ్ సైతం అలాంటి డ్రెస్ వేసుకున్నారు. లక్ష్మి ప్రణతి శారీలో మెరిసిపోతోంది. ఇందులో ఎన్టీఆర్ కుమారులు ఇద్దరు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యారు. ఇద్దరు ఎంతో క్యూట్ గా ఉన్నారు. ఎన్టీఆర్ కాస్త ఒళ్ళు చేసి ఉన్నాడు. లక్ష్మీ ప్రణతి మాత్రం పెళ్లెప్పుడు ఎలా ? ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నట్టు ఉంది.

ల‌క్ష్మీప్ర‌ణ‌తి చ‌క్క‌గా క్యూట్‌లో లుక్‌లో అద‌ర‌గొడుతోంది. చిన్న కుమారుడు భార్గవ్ రామ్ అయితే ఎంతో క్యూట్గా అమాయకపు ఫేస్‌తో చూస్తున్నాడు. ఇక పెద్దకొడుకు అభయ్ రామ్ స్పెట్స్‌ పెట్టుకుని కాస్త బొద్దుగా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలో ఎన్టీఆర్ పిల్లలు ఇద్దరిని చూస్తుంటే చాలా పెద్దగా అయిపోయినట్టు ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ఫ్యామిలీ ఫోటో బయటకు రావడంతో ఈ ఫోటోను ఎన్టీఆర్, నందమూరి అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news