Newsబన్నీ, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అంద‌రూ క‌లిసి ఇంత మోసం...

బన్నీ, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అంద‌రూ క‌లిసి ఇంత మోసం చేశారేంటి సామి…!

పేరుకు మాత్రమే టాలీవుడ్ స్టార్ హీరోలు అని చెప్పుకుంటున్న వాళ్ళ నుంచి కనీసం ఏడాదికి ఒక సినిమా కూడా రావటం లేదు. 2023 దీపావ‌ళి వచ్చేసింది. మరో నెలలో 2024 కూడా వచ్చేస్తుంది. 2023 టాలీవుడ్ లో చాలా మామూలుగా గడిచిపోయింది. టాప్ హీరోల్లో నలుగురు సినిమాలు లేకుండానే ఈ సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది. సంక్రాంతి అంటే మహేష్, బన్నీల సినిమాలు కామన్‌గా విడుదలవుతూ ఉంటాయి. అలాంటిది 2023లో ఈ ఇద్దరు సినిమాలు లేవు. ఆర్ఆర్ఆర్ పుణ్యమా అని ఎన్టీఆర్ సినిమా చూసి ఎన్నాళ్లయిందో.

2023లో ఎన్టీఆర్ సినిమా కూడా లేదు. ఆచార్య తర్వాత రామ్ చరణ్‌ను ఇప్పటి వరకు తెరపై చూడనే లేదు. అలా మహేష్, బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ నలుగురు హీరోలు కూడా ఈ ఏడాది తమ అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ అభిమానులను బాగా నిరాశ పరిచారు. వీళ్ళు అతి జాగ్రత్తగా సినిమాలు తీయటానికి చాలా కారణాలు ఉన్నాయి. పాన్ ఇండియా, భారీ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా నెక్ట్స్‌ లెవెల్ లో ఉండాలి… కచ్చితంగా హిట్టు కొట్టాలి.. బ్లాక్ బస్టర్ అవ్వాలి.. అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండాలి అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు.

దీంతో ఇప్పటివరకు ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఏడాదికి ఒక్క సినిమా కూడా రావటం గగనం అయిపోతుంది. ఇక పాన్ ఇండియా అంటే.. హీరోయిన్, టెక్నికల్ కాస్ట్ అండ్ క్రూ దగ్గర నుంచి చాలాకాలం వేచి చూడాల్సి వస్తోంది. వాళ్ల డేట్లు దొరకటం లేదు. కాంబినేషన్‌లు సరిగా సెట్ కావడం లేదు. భారీ బడ్జెట్ సినిమా నిర్మాణం ఆలస్యం అవుతుంది. దీంతో ఒక్కో సినిమాకి ఏడాది నుంచి రెండు. మూడేళ్లు పడుతుంది.

అలా 2023లో పైన చెప్పుకున్న నలుగురు స్టార్ హీరోల సినిమాలు లేకుండానే సంవత్సరం వృధా అయిపోయింది. 2024 లో మాత్రం బన్నీ, ఎన్టీఆర్ సినిమాలు వరుసగా రానున్నాయి. సంక్రాంతి నుంచి దసరా వరకు వీళ్ళ అభిమానులు హంగామా అంతా ఇంత కాదు. ఇకనుంచి అయినా ఈ స్టార్ హీరోలు కనీసం ఏడాదికి ఒక సినిమా అయినా చేస్తే థియేటర్లు కళకళలాడుతూ ఉంటాయి. టాలీవుడ్ కాస్త కళతో ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news