Moviesవార్నీ.. విజయ్ దేవరకొండ "ఫ్యామిలీ స్టార్" సినిమా ..ఆ తెలుగు హీరో...

వార్నీ.. విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” సినిమా ..ఆ తెలుగు హీరో రియల్ లైఫ్ స్టోరీనా..?

ఈ మధ్యకాలంలో జనాలు భారీ భారీ యాక్షన్ సీన్స్ ..భారీ భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించిన సినిమాలను లైక్ చేయడం లేదు. చాలా చాలా సింపుల్ స్టోరీ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసే అటువంటి కథలు నచ్చుతున్నారు . అందుకే డైరెక్టర్ లు సైతం రూటు మార్చి చాలా సింపుల్ స్టోరీస్ ని చూస్ చేసుకుంటున్నారు . తాజాగా అలాంటి సినిమానే తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది .

విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ నిన్న రిలీజ్ అయింది . ఈ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండ చాలా సింపుల్ లుక్స్ లో ఆకట్టుకున్నారు . అంతేకాదు విజయ్ దేవరకొండ మృణాల్ ఈ సినిమాలో భార్యాభర్తలుగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది .

అయితే రిలీజ్ అయిన గ్లింంప్స్ ఆధారంగా ఈ సినిమా చాలా సింపుల్ స్టోరీ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . అంతేకాదు గ్లింప్స్ ఆధారంగా ఈ సినిమా టాలీవుడ్ హీరో రియల్ స్టోరీ అని చెప్పుకొస్తున్నారు. ప్రెసెంట్ ఆ హీరో మన మధ్య లేడు అని .. ఆ హీరో జీవిత ఆధారంగానే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ తెరకెక్కించారని తెలుస్తుంది . ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news