Movies' భగవంత్ కేసరి ' ఓటీటీ డీటైల్స్‌... ఎన్ని రోజుల త‌ర్వాత‌......

‘ భగవంత్ కేసరి ‘ ఓటీటీ డీటైల్స్‌… ఎన్ని రోజుల త‌ర్వాత‌… ఎక్క‌డ స్ట్రీమింగ్‌..!

వయసుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్​ టు బ్యాక్​ సూపర్ హిట్ల‌తో దూసుకుపోతున్నాడు సీనియర్ హీరో నటసింహాం నందమూరి బాలకృష్ణ. అఖండ – వీర సింహా రెడ్డి లాంటి బ్లాస్ బాస్టర్​ హిట్లను త‌న ఖాతాలో వేసుకున్న బాల‌య్య తాజాగా భ‌గ‌వంత్ కేస‌రి సినిమాతో ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చ‌డు. ఈ సినిమాకు కూడా ప్రీమియ‌ర్ షోల త‌ర్వాత పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

సినిమా బాగుంద‌నే రెస్పాన్స్ థియేట‌ర్ల ద‌గ్గ‌ర వినిపిస్తోంది. నంద‌మూరి అభిమానుల ర‌చ్చ అయితే మామూలుగా లేదు. ఓపెనింగ్స్ గ‌ట్టిగా వ‌చ్చేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రైట్స్ స్ట్రీమింగ్ హక్కులకు మంచి పోటీ ఏర్పడ‌గా ప్ర‌ముఖ‌ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భ‌గ‌వంత్ కేస‌రి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమా ఈ రోజు రిలీజ్ సంద‌ర్భంగా ఓటీటీ పార్ట్‌న‌ర్ డీటైల్స్‌ను టైటిల్ కార్డ్స్‌లో చూపించేశారు. ఈ సినిమాను రిలీజ్ అయిన 50 రోజుల త‌ర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాత‌లు అగ్రిమెంట్ చేసుకున్నార‌ని తెలిసింది. ఈ సినిమా అక్టోబ‌ర్ 19న విడుద‌ల కావ‌డంతో డిసెంబ‌ర్ రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news