Moviesజాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన లయ..పాన్ ఇండియా సినిమాతో రీ ఎంట్రీ..!!

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన లయ..పాన్ ఇండియా సినిమాతో రీ ఎంట్రీ..!!

సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇది కామన్ అయిపోయింది. ఒకానొక టైంలో సినిమా ఇండస్ట్రీలో తమ అందచందాలతో ఏలేసిన ముద్దుగుమ్మలు.. పెళ్లిళ్లు చేసుకొని.. పిల్లలను కన్నెసి లైఫ్ లో సెటిలైపోయిన తర్వాత మళ్లీ నటనపై ఇంట్రెస్ట్ కలిగి.. ఇండస్ట్రీలో రీఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ లయ . ఈ పేరు చెప్తే జనాలు అందరికీ కుందనపు బొమ్మే గుర్తొస్తుంది. చక్కగా చీర కట్టుకొని ..తల నిండా పూలు పెట్టుకొని.. ముఖానికి పసుపు రాసుకొని.. పెద్ద బొట్టు పెట్టుకొని.. చెవులకి జుంకాలు ..మెడలో దండలు ..నడుముకి వడ్డాణం.. జడకి జడగంటలు ..ఈ ఆకారంలో కనిపిస్తుంది.

ఎవరైనా సరే ఇంత ట్రెడిషనల్ బ్యూటీ ని చూశాక అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారా..లైక్ చేయకుండా ఉంటారా..? కచ్చితంగా అమ్మడును లైక్ చేస్తారు . అయితే సినిమా ఇండస్ట్రీలో పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయినా లయ.. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా ద్వారా మళ్ళీ పాపులారిటీ లోకి వచ్చింది. మరీ ముఖ్యంగా ఇన్స్టా లో.. లయ చేసే రీల్స్ ఎంతలా ట్రెండ్ అవుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇలాంటి టైం లోనే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన లయ మాటలకి ఫిదా అయిపోయిన ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్ లయకు ఫోన్ చేసి విసిగించి మరీ ఆమెను తమ సినిమాలో పెట్టుకోబోతున్నాడు అంటూ తెలుస్తుంది . ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. లయ ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమా డీటెయిల్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లయ ప్రధాన పాత్రలో నటిస్తుందట . అటు హీరోయిన్ కాదు ఇటు హీరోకి తల్లి కాదు సినిమాని మలుపు తిప్పే పాత్రలో కనిపించబోతుందట. కాగా ఇది మొత్తం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది అన్న సంగతి తెలిసిందే . ఇలాంటి క్రమంలోనే లయ కూడా రామ్ చరణ్ లాంటి హీరోతో ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అంటూ ఈ సినిమాకు సైన్ చేసిందట . చూడాలి మరి ఈ సినిమాపై అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news