Moviesబాలయ్య కెరీర్ లోనే ఇది ఓ రికార్ట్.. ఒక్క ఫైట్ లేకుండా...

బాలయ్య కెరీర్ లోనే ఇది ఓ రికార్ట్.. ఒక్క ఫైట్ లేకుండా చేసిన సినిమా ఇదే..!!

సినిమా అన్నాక పాటలు ..రొమాన్స్ ..ఫైట్ ..ఏడుపులు అన్నీ ఉండాల్సిందే.. అన్ని కలగలిగిస్తేనే అది సినిమా అంటారు . అన్ని ఎమోషన్స్ సరిగ్గా పండించేవాడు రియల్ హీరో అంటూ జనాలు చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు కథానుసారం సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉండవు.. పాటలు ఉండవు ..ఫైట్లు కూడా చాలా తక్కువగా ఉంటాయి . అయితే కొందరు అభిమానులు మాత్రం తమ హీరో అలాంటి రోల్ లోనే కనిపించాలి అని ఆశపడుతూ ఉంటారు .

అలాగే బాలయ్య అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఫైట్స్. తొడ కొట్టడాలు.. ట్రైన్ ఆపడాలు బాలయ్య సినిమాలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. జనాలు కూడా దాన్ని బాగా లైక్ చేస్తూ ఉంటారు. అయితే బాలయ్య కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించిన ఇప్పటివరకు ఒక్క సినిమాలోనే ఫైట్ లేకుండా నటించాడు . ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!!

బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా “నారీ నారీ నడుమ మురారి “. ఈ సినిమాలో ఒక్కటంటే ఒక ఫైట్ కూడా ఉండదు. ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్యకు జోడిగా శోభన – నిరోషా నటించారు . శారద కైకెల సత్యనారాయణ – అల్లు రామలింగయ్య – రామప్రభ తదితరులు కీలకపాత్ర పోషించి ఈ సినిమా విజయానికి కారకులయ్యారు. 1990లో విడుదలైన కుటుంబ కథా చిత్రం ఇది. ఈ సినిమాల్లో పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హీట్ అయినా ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క ఫైట్ సీన్ కూడా ఉండదు. అయినా కూడా సినిమా విజయం సాధించింది .దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బాలయ్య ఎంత మల్టీ టాలెంటెడో.. కేవలం ఫైట్ యాక్షన్ సీన్స్ కాదు .. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతోనూ సక్సెస్ సాధించగలడు మన బాలయ్య అంటూ అభిమానులు ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news