Movies"అక్క తో అలాంటి పనులు చేస్తారా రా..?".. సమంత స్టైలీస్ట్ ప్రీతమ్...

“అక్క తో అలాంటి పనులు చేస్తారా రా..?”.. సమంత స్టైలీస్ట్ ప్రీతమ్ జుకల్కర్ ని అడిగి కడిగేసిన నాగ చైతన్య ఫ్యాన్స్..!!

ప్రీతం జుకల్కర్ .. ఏడాది ముందు వరకు ఈ పేరు అసలు ఎవరికీ తెలియదు . అసలు అతగాడు ఎవరో అంటూ కూడా జనాలు చర్చించుకునే అంత స్థాయి కూడా ఆయనకి లేదు . అయితే ఎప్పుడైతే నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్నారో.. అదే టైంలో సమంత ఇతగాడి ఫోటోలు బయటికి వచ్చాయో .. అప్పటినుంచి సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వెబ్ మీడియాలో ప్రీతం జుకాల్కర్ పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది.

ఈ ప్రీతం జుకల్కర్ ఎవరో కాదు సమంత స్టైలిస్ట్. అంతకుముందు సమంత స్టైలిస్ట్ గా వేరే వ్యక్తి ఉండేవాళ్లు .. అయితే సమంత అతగాడి టాలెంట్ నచ్చి ఇతగాడిని తన స్టైలిష్ గా పెట్టుకునింది. అయితే స్టైలిష్ వరకే ఉంటే పర్లేదు .. అతగాడితో హద్దులు మీరి స్నేహం చేసింది . ఈ క్రమంలోనే కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారాయి. కాగ నాగచైతన్య – సమంత విడాకులు తీసుకోవడానికి కారణం ప్రీతం జుకల్కర్ అంటూ అప్పట్లో జనాలు మండిపడ్డారు.

రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రీతం దాని గురించి క్లారిటీ ఇచ్చాడు . ప్రీతం మాట్లాడుతూ..” నేను సమంత బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగా.. మా బంధాన్ని తప్పుపట్టారు ..నాలో టాలెంట్ ఉందని ప్రోత్సహించింది సమంత గారే.. కానీ చాలామంది మా ఇద్దరిని విమర్శించారు . అసలు ఈ ముంబై గాడు నీకు అవసరమా..? అంటూ సమంత గారిని చాలా బాధపెట్టారు . ఆ మాటలు నన్ను చాలా బాధ పెట్టాయి. ఎలాంటి పరిచయాలు లేకుండా ఓన్ టాలెంట్ తో ఇండస్ట్రీ లోకి వచ్చి ఎదిగాను . నేనేం చెడ్డ వాడిని కాదు.. అమ్మాయితో తప్పుగా ప్రవర్తించే వాడిని కాదు ..ఒక ఆర్టిస్ట్ ను నేను హీరోయిన్లకు మాత్రమే ఎక్కువగా ఎందుకు డిజైన్ చేస్తాను అంటూ చాలామంది అడుగుతూ ఉంటారు . హీరోలు ప్రయోగాలు చేయడానికి ఒప్పుకోరు . హీరోయిన్స్ మాత్రమే ప్రయోగాలు చేస్తారు . అందుకే నేను హీరోయిన్ స్టైలిష్ గా ఉన్నాను ..నాకు సమంతకి మధ్య ఎలాంటి చెడు సంబంధం లేదు” అంటూ చెప్పుకొచ్చారు .

అయితే దీనిపై నాగచైతన్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ” నువ్వు అన్నదే నిజం అనుకుంటాం.. ఒక తమ్ముడు ఒక అక్కతో ఇలా ప్రవర్తిస్తాడా ..? పెళ్లయిన ఒక అమ్మాయితో చడ్డీలు మిడ్డీలు వేసుకొని కాళ్లను ఒడిలో పెట్టుకుంటాడా ..? క్లోజ్ గా సెల్ఫీలు దిగుతారా..? భుజాలపై చేయి వేసుకుంటాడా..? అంటూ ప్రశ్నిస్తున్నారు . అయితే సామాన్య జనాలు కూడా ఇదే వాస్తవం అంటున్నారు . పెళ్లి తర్వాత ఏ ఆడపిల్ల అయినా హద్దుల్లో ఉంటుంది. వాళ్ల జోలికి కూడా మనం వెళ్లకూడదు. నువ్వు ప్రవర్తించిన తీరు నువ్వే తెలుసుకో..? ఈ క్రమంలోనే ప్రీతం జుకాల్కర్ ని ఏకీపారేస్తున్నారు నాగచైతన్య ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news