Newsశాకుంతలం సినిమాని ఆ డైరెక్టర్ తెరకెక్కించుంటే..ఆస్కార్ వచ్చేదా..? గుణశేఖ వింటే గుండె...

శాకుంతలం సినిమాని ఆ డైరెక్టర్ తెరకెక్కించుంటే..ఆస్కార్ వచ్చేదా..? గుణశేఖ వింటే గుండె ఆగిపోవాల్సిందే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన సినిమా శాకుంతలం . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్ది నెలల క్రితమే గ్రాండ్గా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయ్యి అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది . శకుంతల దేవి పాత్రలో సమంత లీనం అయిపోయిన.. దేవ్ మోహన్ దుశ్యంతుడి పాత్రలో మెప్పించిన ..ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

దానికి మెయిన్ రీజన్ ఈ కథ అందరికీ తెలిసిందే కావడం.. పైగా ఓవర్గా గ్రాఫిక్స్ ఉండడం.. సినిమాకి మరింత నెగిటివ్ టాక్ క్రియేట్ చేసింది . అయితే రీసెంట్ గా దీనిపై వేణు స్వామి స్పందించారు .”నిజానికి సమంత నటించిన శాకుంతలం సినిమా గుణశేఖర్ కాకుండా రాజమౌళి తెరకెక్కిచుంటే..ఈ సినిమాకి ఆస్కార్ వచ్చుండేదని.. ఆయనకు ఆ సత్తా ఉందని ..పది రూపాయల సినిమాని కూడా 100 రూపాయల రేంజ్ లో పబ్లిసిటీ చేయడం రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య “అంటూ కామెంట్స్ చేశారు .

దీంతో సోషల్ మీడియాలో శాకుంతల సినిమా పేరుని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు. అంతేకాదు నిజంగానే రాజమౌళి ఆ రేంజ్ లో తెరకేక్కిచుంటే ఆస్కార్ కంఫామ్ అనిచెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్. మరికొందరు ఈ డైలాగ్ గుణశేఖర్ వింటే పరువు పోయిన్నత్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అంటే గుణ శేఖర్ వేస్ట్ అనేగా అర్థం…? అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మరోసారి రాజమౌళి – సమంత -శాకుంతలం పేర్లు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news