Moviesశాకుంతలం ఫ్లాప్.. కోట్లు నష్టం.. అయినా సమంతకు చీమ కుట్టిన్నట్లు కూడా...

శాకుంతలం ఫ్లాప్.. కోట్లు నష్టం.. అయినా సమంతకు చీమ కుట్టిన్నట్లు కూడా లేదే..ఎందుకంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా శాకుంతలం . ఈ సినిమాలో సమంత శకుంతల దేవి పాత్రలో కనిపించింది . దుష్యంతుడు పాత్రలో మలయాళం హీరో దేవ్ మోహన్ కనిపించాడు. ఈ సినిమాని మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించారు . ఈ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్గా థియేటర్స్ లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి ..డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది .

పెట్టిన దానికి సగం కూడా వసూలు రాబట్టకుండా డిజాస్టర్ కా బాప్ అనిపించింది . అయితే శాకుంతలం సినిమా ఇంత డిజాస్టర్ అయినందుకు ప్రతి ఒక్కరు స్పందించారు . కానీ సమంత ఈ సినిమాపై ఇప్పటివరకు స్పందించనేలేదు. అంతేకాదు ఎక్కడ కూడా సమంత శాకుంతలం సినిమా ఫ్లాప్ అయినట్లు ప్రస్తావించలేదు . అంతేకాదు అసలు గుణశేఖర్ ని కూడా పట్టించుకోనేలేదట .

జనరల్ గా ఏ హీరోయిన్ అయినా సరే ఇంత సినిమా డిజాస్టర్ అయితే రెమ్యూఅనరేషన్ లో కనీసం సగమైన వెనక్కి ఇస్తారు. అయితే సమంత మాత్రం అలా ఏం చేయకపోవడంతో ఫాన్స్ కూడా హార్ట్ అవుతున్నారు. సమంత ఎందుకు శాకుంతలం ప్లాప్ అయిన పట్టించుకోవడం లేదు ..పాజిటివ్ – నెగటివ్ రిప్లై ఇవ్వాలి కదా.. అంటున్నారు . మొన్న ఆ మధ్య ఓ నెటిజన్ శాకుంతలం ఫ్లాప్ అని చెప్పినందుకు ఏకంగా అతగాడిని బ్లాక్ చేసేసింది సమంత . ఈ క్రమంలోని సమంత ఇలాంటి పనులు కూడా చేస్తుందా..? అంటూ షాక్ అయిపోతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news