Movies' శాకుంత‌లం ' డిజాస్ట‌ర్‌పై దిల్ రాజు సెటైర్లు… అవి సూటిగా...

‘ శాకుంత‌లం ‘ డిజాస్ట‌ర్‌పై దిల్ రాజు సెటైర్లు… అవి సూటిగా వాళ్ల‌కే త‌గిలాయా…!

సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు మొదటి ఆటకే అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్లలో సమంత ఎంతో సంపతి గేమ్ ప్లే చేసినట్టుగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఇటు దిల్ రాజు బ్యాకప్.. అటు రుద్రమదేవి లాంటి సినిమా తర్వాత గుణశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమా.. ఇటు సమంత ఇవన్నీ ఉన్నా కూడా శాకుంత‌లం సినిమాను ఏ మాత్రం ఆదుకోలేకపోయాయి. సినిమా ప్లాప్ అవ్వటం ఒక ఎత్తు అయితే.. ఘోరంగా డిజాస్టర్ అవటం మరో ఎత్తు.

ఈ పరాజయంపై సమంత తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే. భగవద్గీతలోని శ్లోకం ” పని చేయడం వరకే మన వంతు, ఫలితం మన చేతిలో ఉండదు ” కోట్ చేస్తూ సమంత శకుంతలం పరాజయాన్ని ఒప్పుకుంది. అయితే ఇలా ఇండైరెక్టుగా మాట్లాడటం దిల్ రాజుకు కుదరదు. దిల్ రాజుది అంతా పక్కా బిజినెస్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే ఆయనకు అలవాటు. అలాగే శాకుంతలం అట్టర్ ప్లాప్ పై అలాగే స్పందించాడు.

తన 25 సంవత్సరాల సినిమా కెరియర్లో శాకుంత‌లం సినిమాను అతిపెద్ద లాస్ గా ఒప్పుకున్నాడు. ఇక సగటు సినీ ప్రేక్షకులను కూడా అన్ని థియేటర్లకు పంపించి రివ్యూలు తెప్పించేసాం.. అప్పటికే సినిమా ఏంటి అనేది మాకు అర్థమయిపోయింది.. సోమ‌, మంగళవారాలకే కలెక్షన్లు లేవంటే రిజల్ట్ ఏంటి అనేది గ్రహించాలి.. అప్పటికీ భ్ర‌మ‌ ఉండకూడదు.. నా 25 సంవత్సరాల సినిమా కెరియర్ లో శాకుంతలం అతిపెద్ద జ‌ర్క్‌ ఇచ్చిందని దిల్ రాజు చెప్పారు.

ఈ సినిమాను దిల్ రాజు – గుణశేఖర్ కలిసి నిర్మించారు. పెట్టిన పెట్టుబడిలో కనీసం 25 % కూడా వెనుక్కు రాలేదని అంటున్నారు. మరి ఎవరికి ఎన్ని కోట్లు బొక్క వచ్చిందో వాళ్ళిద్దరికీ తెలియాలి. ఏది ఏమైనా దిల్ రాజు ఇంత ఓపెన్ గా మాట్లాడటాన్ని బట్టి చూస్తే గుణశేఖర్ సమంతను టార్గెట్ గా చేసుకుని సెటైర్లు వేశారా ? వారిద్దరిపై నమ్మకంతోనే తాను అంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి లాస్ అయ్యానని చెప్పకనే చెప్పేసారన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news