MoviesIPL 2023 రష్మిక డ్యాన్స్ చేసినందుకు ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా..ఇండస్ట్రీలోనే...

IPL 2023 రష్మిక డ్యాన్స్ చేసినందుకు ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా..ఇండస్ట్రీలోనే ఇది ఓ రికార్డ్..!!

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది. ఐపీఎల్ 2023 గ్రాండ్ గా ప్రారంభమైంది . అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో ఘనంగా మొదలైన ఐపిఎల్ 2023 ఓపెనింగ్ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న తమన్నా – రష్మిక మందన ఫస్ట్ టైం చిందులేసారు. ఇప్పటివరకు ఈ ఈవెంట్లో బాలీవుడ్ బ్యూటీలే చిందులేసారు.

మన తెలుగు బ్యూటీలు ఆడి పాడిందే లేదు. కానీ ఫస్ట్ టైం తమన్న – రష్మిక మన తెలుగు ఇండస్ట్రీ పరువు నిలబెట్టారు . వరుస ఆఫర్లు అందుకుంటూ బాలీవుడ్ ను షేక్ చేస్తున్న మిల్కీ బ్యూటీ తమన్న -రష్మిక తమ డ్యాన్స్ ల తో అదరగొట్టేసారు . ఈ ముద్దుగుమ్మల పెర్ఫార్మన్స్ కు స్టేడియం దద్దరిల్లిపోయింది . అరుపులు కేకలతో రచ్చ రచ్చ చేసారు. తమన్నా మోడ్రన్ దుస్తులతో ఆకట్టుకుంటే .. రష్మిక మందన ట్రెడిషనల్ లెహంగాలో ఆకట్టుకునింది.

అంతేకాదు ఆస్కార్ అవార్డు అందుకున్న నాటునాటు పాటకు పర్ఫామెన్స్ చేసి అభిమానులను ఎంటర్టైన్ చేసింది రష్మిక. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రష్మిక మందన ఈ ఈవెంట్లో డాన్స్ చేసినందుకు ఏకంగా ఐదు కోట్లు చార్జ్ చేసిందట . అదే తమన్నా మూడు కోట్లతో సరిపెట్టుకునింది అని తెలుస్తుంది . రష్మిక కి ఉండే క్రేజ్ ఆధారంగా ఇప్ల్ టీం ఆమె అడిగినంత ఇచ్చినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో ఇంత భారీ మొత్తంలో అందుకున్న హీరోయిన్ రష్మిక మందన నే కావడం గమనార్హం. దీంతో రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news