Moviesచైతు - శోభిత దూళిపాళ ఎఫైర్‌పై ఫ‌స్ట్ టైం నోరు విప్పిన...

చైతు – శోభిత దూళిపాళ ఎఫైర్‌పై ఫ‌స్ట్ టైం నోరు విప్పిన స‌మంత‌… ఎక్క‌డ కొట్టాలో అక్క‌డే కొట్టిందిగా..!

అక్కినేని హీరో నాగచైతన్యతో విడిపోయాక స్టార్ హీరోయిన్ సమంత చాలా ట్రోలింగ్‌కు గురైంది అన్ని వేళ్ళు కూడా సమంత వైపే ఎత్తిచూపాయి. అసలు విడాకులు తర్వాత ఒక మహిళకు ఎన్ని అవమానాలు ?ఎదురవుతాయో.. ఓ సెలబ్రిటీ ఓ స్టార్ హీరోయిన్గా ఉన్న సమంతకు అంతకంటే ఎక్కువ అవమానాలు ఎదురయ్యాయి. ఇక తెలుగు సినిమా జనాలతో పాటు అక్కినేని అభిమానులు కూడా సమంతనే ఎక్కువగా టార్గెట్ చేశారు. అయినా కూడా సమంత ఎప్పుడూ సంయమనం కోల్పోలేదు.

నాగచైతన్యకు అటు అక్కినేని ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదు. అయితే తొలిసారిగా సమంత తన శైలీకి భిన్నంగా మాట్లాడినట్టు కనిపించింది. ఆమె నటించిన శాకుంతలం సినిమా ప్రమోషన్లలో తన విడాకుల గురించి మాట్లాడింది. తను తప్పేం చేయలేదని.. వైవాహిక బంధానికి సంబంధించి తాను నూటికి నూరు శాతం నిజాయితీగా ఉన్నానని.. తన బంధానికి తను అంకితమయ్యానని చెప్పింది. అయితే సమంత విడాకులపై స్పందించిన టైమింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో సంచల‌నంగా మారింది.

మరోవైపు నాగచైతన్య – శోభిత డేటింగ్ పై పుకార్లు గుప్పుమంటున్నాయి. ఇలాంటి సమయంలో సమంత ఇలా రియాక్ట్ అవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. సమంత – చైతు అసలు ఎందుకు ? విడిపోయారు అనేది ఎప్పటికీ టాప్ సీక్రెట్. అమల‌ కారణమని.. నాగార్జున కారణం అని చైతు మరో అమ్మాయితో ప్రేమాయణం నడపడం కారణమని ఇలా రకరకాల గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు నాగచైతన్య పై రూమర్లు నడుస్తున్నాయి. శోభితతో అతడు డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు మొదలయ్యాయి. పైగా ఇద్దరు కలిసి సీక్రెట్ గా లండన్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి.

ఇలాంటి టైంలో సమంత తన తప్పేం లేదన్నట్టు మాట్లాడింది. దీంతో ఇప్పుడు అన్నివేళ్లు నాగచైతన్య వైపే చూపిస్తున్నాయి. అంటే చైతు సమంతతో విడాకులు ముందు నుంచే శోభితతో ఎఫైర్ నడుపుతున్నాడా ? అందుకే సమంత బాధపడి విడాకులు ఇవ్వటానికి కారణమైందా ? అన్న కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఇక చైతు మాత్రం ఎప్పటిలాగానే అదే నిశ్శబ్దాన్ని కొనసాగిస్తూ తన పని తాను చేసుకు పోతున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news