News"సినిమా ఇండస్ట్రీ సంకనాకిపోవడానికి కారణం అదే".. కడుపు మంటతో మొత్తం కక్కేసిన...

“సినిమా ఇండస్ట్రీ సంకనాకిపోవడానికి కారణం అదే”.. కడుపు మంటతో మొత్తం కక్కేసిన తేజ..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పొజిషన్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టార్ గా ఉన్న హీరో జీరో అవ్వడం.. జీరోగా ఉన్న హీరో స్టార్ కావడం ఒక సినిమాతోనే జరిగిపోతుంది . అంతేకాదు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కూడా ఊహించని పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటూ ఉన్నాయి . కోట్లకు కోట్లు పోసి సినిమాని తెరకెక్కించిన జనాలకి నచ్చడం లేదు . భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు అన్ని ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన సినిమాలు పెట్టిన దానికి పది రెట్లు లాభాలు తీసుకొచ్చి సంచలనాన్ని క్రియేట్ చేస్తున్నాయి .

ఈ క్రమంలోనే రీసెంట్గా గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేసిన డైరెక్టర్ తేజ .. సినీ ఇండస్ట్రీ పై సంచలన కామెంట్స్ చేశారు . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుస ఫ్లాప్ లకు కారణం ఓటిటి కానే కాదు అంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు ఆయన మాట్లాడుతూ..”ఈ మధ్య బాగా వినిపిస్తున్న కంప్లైంట్ మల్టీప్లెక్సుల్లో పాప్ కార్న్, కోక్‌ రేట్లు విపరీతంగా ఉంటున్నాయి అని. నిజానికి టికెట్ రేట్ల కంటే వాటి ధరలే ఎక్కువగా ఉన్నాయని అన్నది వాస్తవం. చాలా మంది ఓటీటీలు సినిమా ని చంపేస్తున్నాయ్ అంటున్నారు. కానీ, పాప్ కార్న్‌ రేటు థియేటర్లలో సినిమాని చంపగలదు. ముంబయిలో సినిమా చచ్చిపోయింది అంటే దానికి మెయిన్ రీజన్ అదే. ఒక్క పాప్ కార్న్‌ రేటు మాత్రం చంపగలదు “అంటూ మండిపడ్డారు.

అంతేకాదు తేజ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయన కడుపు బాగా మండి ఈ మాటలు మాట్లాడినట్లు ఉంది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఈ మధ్యకాలంలో డైరెక్టర్ తేజ సినిమాలన్నీ బోల్తా కొట్టాయి . అంతేకాదు ఒకప్పుడు తేజ అంటే ఎంత మంచి పేరు ఉందో .. ఆ తర్వాత తేజ పేరుకి అంత క్రేజ్ లేకపోవడం చెప్పుకోవాల్సిన విషయం .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news