Newsఇండస్ట్రీలో ఎంత మంది హాట్ బ్యూటీస్ ఉన్నా..బాలయ్య ఫేవరేట్ మాత్రం ఆ...

ఇండస్ట్రీలో ఎంత మంది హాట్ బ్యూటీస్ ఉన్నా..బాలయ్య ఫేవరేట్ మాత్రం ఆ హీరోయినే..ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు హీరోయిన్లు ఉన్న ప్రతి ఒక్కరికి ఓ హీరోయిన్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది . నటనపరంగా ..యాక్టింగ్ పరంగా ..అందం పరంగా పర్సనల్ రీజన్స్ కారణంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరోయిన్ హీరో అంటే ఇష్టం ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో స్టార్స్ కు ..ఎంతోమంది జనాలకు ఫేవరెట్ హీరోగా ఉన్న బాలయ్యకు ఏ ఫేవరెట్ హీరోయిన్ ఇష్టం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మనకి బాలయ్య అంటే ఎలా ఇష్టమో బాలయ్యకి కూడా ఓ హీరో హీరోయిన్ అంటే ఇష్టం ఉండే ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలతో హీరోయిన్ లతో స్క్రీన్ షేర్ చేసుకున్న బాలయ్యకు మహానటి సావిత్రి అంటే చాలా చాలా ఇష్టమట. ఎంతమంది ఇండస్ట్రీలో ఉన్న ఎంతమంది కుర్రబ్యూటీలు నటనపరంగా మెప్పిస్తున్న సరే బాలయ్య ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే మాత్రం ఖచ్చితంగా సావిత్రి అనే చెప్పుకొస్తారట .

అంతేకాదు ప్రజెంట్ జనరేషన్లో బాలయ్యకు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే మాత్రం ఆయన టక్కున చెప్పేది పేరు నయనతార. ఒకప్పుడు సావిత్రి ఎలా నటించిందో ఇప్పుడున్న ఇండస్ట్రీలో జనరేషన్లో నయనతార అలా నటిస్తుందని బాలయ్య అభిప్రాయపడుతున్నారట . అందుకే ఆమెతో సినిమా చేసే అవకాశం వస్తే బాలయ్య ఏ మాత్రం మిస్ అవ్వడట . అంతెందుకు అనిల్ రావిపూడి డైరెక్షన్లో హీరోయిన్గా కూడా ముందు నయనతారనే అనుకున్నారట. కానీ కథ ప్రకారం ఆమె సెట్ అవ్వదు అంటూ లాస్ట్ లో కాజల్ ని తీసుకున్నారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news