Moviesఎన్టీఆర్ - కొర‌టాల సినిమాలో 3 అదిరిపోయే ట్విస్టులు ఇవే...!

ఎన్టీఆర్ – కొర‌టాల సినిమాలో 3 అదిరిపోయే ట్విస్టులు ఇవే…!

త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి మరో నెల రోజులకు ఏడాది పూర్తవుతుంది. దాదాపు ఏడాదికాలంగా ఎన్టీఆర్ ఖాళీగా ఉంటున్నాడు. కొరటాల శివ సినిమా అదిగో ఇదిగో అంటున్నారే కానీ ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. ఈనెల 24 నుంచి షూటింగ్ ఉంటుందని అంటున్నారు. ఈసారి అయినా షూటింగ్ జరుగుతుందా లేదా ? మళ్లీ వాయిదా పడుతుందా అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్టీఆర్ అభిమానులు అయితే తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు. ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల ఎన్టీఆర్ తో సినిమా విషయంలో గందరగోళానికి గురవుతున్న మాట వాస్తవం.

ఎలాంటి కథతో సినిమా చేయాలన్న దానిపై కొరటాల ఒక పట్టాన‌ తేల్చుకోలేకపోతున్నాడు. అందుకే ఎన్టీఆర్ సినిమా ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు ఇన్నర్ గా చర్చించుకుంటున్న మాట. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మూడు అదిరిపోయే ట్విస్టులు బ‌యటికి వచ్చాయి. ఇప్పటివరకు వినవచ్చిన వార్తలను బట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ అని తెలుస్తోంది. ఈ రెండు డబుల్ రోల్స్ అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్స్ ఎలా ? ఉన్నాయో.. అదే తరహాలో ఒకటి కాస్త అమాయకపు క్యారెక్టర్… మరొకటి కాస్త యాక్షన్ క్యారెక్టర్ అని తెలుస్తోంది.

అలాగే సముద్రం – పోర్ట్ – స్మగ్లింగ్ నేపథ్యంలో కొరటాల ఈ కథను అల్లుకున్నాడని చెబుతున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్లు, వీడియోల వల్ల కూడా కథ ఇదే స్టైల్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారని… అలాగే ఇది రివెంజ్ డ్రామా స్టోరీ అని కూడా సమాచారం బయటకు వచ్చింది. ఈ లైన్ చూస్తుంటే చాలా సింపుల్ కథలా అనిపిస్తోంది. అయితే ఆచార్య ప్లాప్ తర్వాత క‌సితో రగులుతున్న కొరటాల ఇలాంటి సింపుల్ కథతో ఎన్టీఆర్ తో ఏకంగా పాన్ ఇండియా సినిమా చేస్తాడా ? అన్నది చెప్పలేం.

అయితే ఇప్పటివరకు ఎవరు టచ్ చేయని విషయాలు కచ్చితంగా ఉంటాయని కూడా తెలుస్తోంది. కథ సింపుల్‌గా ఉన్న కొరటాల టేకింగ్ తో పాటు కొత్త అంశాలను మిక్స్ చేస్తే సినిమా అదిరిపోతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా ఎప్పుడు ? షూటింగ్ ప్రారంభమవుతుందో ఎప్పుడు ? రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి. కనీసం వచ్చే ఏడాది అయినా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వస్తుందని ఎన్టీఆర్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news