Moviesముస్లిం షారుఖ్.. హిందూ అమ్మాయి గౌరీతో ఎలా ప్రేమ‌లో ప‌డ్డాడు... ల‌వ్‌స్టోరీలో...

ముస్లిం షారుఖ్.. హిందూ అమ్మాయి గౌరీతో ఎలా ప్రేమ‌లో ప‌డ్డాడు… ల‌వ్‌స్టోరీలో ఇన్ని ట్విస్టులా…!

దాదాపు కొన్నేళ్ల త‌ర్వాత షారుఖ్ ఖాన్ రీసెంట్ గా వచ్చిన పఠాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. పఠాన్ సినిమా షారుక్ కు అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చింది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో దీపికా పదుకొనే హీరోయిన్గా వచ్చిన ఈ సినిమా ఏకంగా ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర ఇంకా స్టడీగా కొనసాగుతోంది. ఇక షారుక్ పఠాన్ ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో న‌య‌న‌తార షారుక్‌కు జోడీగా న‌టిస్తోంది.

షారుక్ తన భార్య గౌరీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి ప్రేమ విషయంలో చాలా ట్విస్టులు ఉన్నాయి. షారుక్ ఖాన్ ముస్లిం. గౌరీ హిందూ అమ్మాయి. వీళ్ళిద్దరికీ పరిచయం లేదు. అయితే ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ ఒక పార్టీలో క‌లిశారు. అప్పటికి షారుక్ వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే.. గౌరీ వయసు 14 సంవత్సరాలు. వీరిద్దరి పరిచయం 1984లో జరిగింది. అలా వారిద్దరి మధ్య కలిగిన ఇష్టం ఆ తర్వాత ప్రేమగా మారింది.

ఏడు సంవత్సరాల పాటు వీరిద్దరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. 1991లో షారుక్ – గౌరీ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇక 34 ఏళ్ల క్రితం ప్రేమికుల రోజున షారుక్ తన భార్య గౌరీకి ఓ మంచి గిఫ్ట్ ఇచ్చాడట. ఆ గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అది ప్లాస్టిక్ ఇయర్ రింగ్స్. గౌరీకి షారుక్ ఇచ్చిన తొలి బహుమతి అదేనట. ఆ గిఫ్ట్ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది అని గౌరీ ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించింది.

బాలీవుడ్ లో ఆ జంట విడిపోయింది. ఈ జంట మధ్య పొరాపచ్చలు వచ్చాయి అని చాలామంది దంపతులపై ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ షారుక్ – గౌరీ దంపతుల జీవితానికి సంబంధించి ఎప్పుడు ఇలాంటి వార్తలు రాలేదు. విచిత్రం ఏంటంటే మతాంతర వివాహం అయినా కూడా వీరిది ఎంతో అన్యోన్య దాంపత్యం. ఈ ప్రేమికుల రోజుకు అభిమానుల నుంచి ఎలాంటి గిఫ్ట్ కావాలని అనుకుంటున్నారు అని షారుఖ్‌ను ప్రశ్నిస్తే ఆల్రెడీ అభిమానులు తనకు పఠాన్ లాంటి సినిమాతో గొప్ప సక్సెస్.. గొప్ప వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చారని అంతకుమించి తాను ఏం కోరుకోన‌ని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news