MoviesSharukh Khan షారుఖ్ పెట్టుకున్న ఈ వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..ఇండియాలోనే...

Sharukh Khan షారుఖ్ పెట్టుకున్న ఈ వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..ఇండియాలోనే అది కొన్న ఏకైక హీరో ఇతనే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు .. వాళ్ళు వాడే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఇట్టే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బడా సెలబ్రిటీస్ వేసుకునే షర్ట్స్ , ప్యాంట్స్.. వాచెస్ కి సంబంధించిన విషయాలు సెకండ్స్ లోనే వైరల్ గా మారిపోతున్నాయి. ఇలాంటి క్రమంలోనే బాలీవుడ్ బాద్షాగా పేరు సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ ధరించిన వాచ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

ఇప్పటివరకు ఇండియాలో ఈ వాచ్ ను ఎవరు ధరించలేదు .. అంటేనే జనాలు ఆశ్చర్యపోతున్నారు . అంతేకాదు ఈ వాచ్ లో బోలెడు స్పెషాలిటీస్ ఉన్నాయని ..ఆ కారణంగానే షారుఖ్ ఖాన్ కొన్నాడంటూ తెలుస్తుంది . రీసెంట్ గా ఆయన నటించిన మూవీ “పఠాన్”. షారుక్ ఖాన్ ఏడేళ్ల తర్వాత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు పడిపోతున్న బాలీవుడ్ ను తన సినిమాలతో లేపి దాదాపు 750 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాడు .

కాగా ఈ సక్సెస్ తో మంచి జోరు మీద ఉన్న షారుఖ్.. రీసెంట్గా ఓ ఈవెంట్ లో మెరిశాడు . అయితే అందరి కళ్ళు షారుక్ ఖాన్ వాచ్ పైనే ఉన్నాయి. ఈ క్రమంలోని షారుక్ ఖాన్ ధరించిన వాచ్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ లో బ్లాక్ షూట్లో దర్శనమిచ్చిన షారుక్ .. చేతికి బ్లూ కలర్ రిచెస్ట్ వాచ్ ను పెట్టుకున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం ఈ వాచ్ ఖరీదు 4 కోట్ల 98 లక్షలు..అంటే దాదాపు ఐదు కోట్లు . ఈ విషయం తెలిసి జనాలు ఓఉరా అంటున్నారు . అంతేకాదు ఇప్పటివరకు ఇండియాలో ఇలాంటి వాచ్ ను ఎవరు పెట్టుకోలేదట,, ఫస్ట్ టైం ఇండియాలో కొనుగోలు చేసిన హీరోగా షారుఖ్ ఖాన్ రికార్డు నెలకొల్పాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news