MoviesNandamuri బిగ్ బ్రేకింగ్: నందమూరి కుటుంబంలో మరో రోడ్ యాక్సిడెంట్.....

Nandamuri బిగ్ బ్రేకింగ్: నందమూరి కుటుంబంలో మరో రోడ్ యాక్సిడెంట్.. కారు నుజ్జునుజ్జు..!!

నందమూరి కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రీసెంట్ గానే నందమూరి హీరో తారకరత్న గుండెపోటుకు గురై నారాయణ హృదయాలయ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పరిస్థితి అదుపులోకి రావడం లేదు.. డాక్టర్లు కూడా అదే చెప్పుకొస్తున్నారు . కాగా ఇలాంటి క్రమంలోనే మరో నందమూరి అబ్బాయికి పెద్ద గండమే తప్పిందని చెప్పాలి .

కాగా శుక్రవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 10 లో నందమూరి కుమారుడు రామకృష్ణకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణకు స్వల్ప గాయాలు అయ్యాయి . ఈ క్రమంలోనే కారు మాత్రం నుజ్జు నుజ్జు అయిపోయింది . దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఇప్పటికే నందమూరి కుటుంబంలో వరుస విషాద ఘటన చోటు చేసుకుంటున్న తరుణంలో ఇలా జరగడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది..

కాగా రీసెంట్గా నందమూరి రామకృష్ణ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారకరత్నను పరామర్శించారు . ఆయన హెల్త్ బాగుందని అభిమానులు టెన్షన్ పడొద్దు అని ..ఆయన సేఫ్గా బయటికి వస్తారని చెప్పుకొచ్చారు . ఇలాంటి క్రమంలోనే రామకృష్ణ గారికిఇలా ఆక్సిడెంట్ అవ్వడం కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన కలిగిస్తుంది . కాగా నందమూరి రామకృష్ణ ప్రజెంట్ బాగున్నట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news