Moviesనీ రేంజ్ వేరే లేవల్.. గాలోడు సినిమా కోసం సుధీర్ ఏంత...

నీ రేంజ్ వేరే లేవల్.. గాలోడు సినిమా కోసం సుధీర్ ఏంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా..?

టాలెంట్ ఉంటే ఎవరైనా సరే ఆదరిస్తారు అని ప్రూవ్ చేశాడు జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ . తనలో టాలెంట్ ఉన్న మంచి ప్లాట్ ఫాం దొరకకపోవడంతో బాధపడుతూ ఉన్న సుధీర్ కు జబర్దస్త్ పిలిచి అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సుధీర్ ..ఇప్పుడు ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు తెలిసిందే. ఒకప్పుడు ఒక పూట తిండి తినడానికి కూడా అల్లాడిపోయిన సుధీర్.. ప్రజెంట్ కార్లలో బంగ్లాల్లో తిరుగుతూ ఒక్క ఎపిసోడ్ కి లక్ష రూపాయలు పైన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు ..అంటే ఆయన రేంజ్ ఏ స్థాయిలో మారిపోయింది మన అర్థం చేసుకోవచ్చు .

కాగా బుల్లితెరపై కమెడియన్ గానే కాదు వెండితెరపై హీరోగా కూడా తన సత్తాను చాటుతున్నాడు . ఇప్పటికే పలు సినిమాలో నటించిన సుధీర్ మంచి నటుడు అంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు . రీసెంట్ గా గాలోడు అనే సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు . కాగా ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది .వన్ టైం వాచేబుల్ మూవీ అంటూ పేరు సంపాదించుకుంది . మరి ముఖ్యంగా ఈ సినిమాలో సుధీర్ నటన బాగుందని.. కొంచెం ట్రై చేస్తే పెద్ద డైరెక్టర్ చేతిలో పడితే సుధీర్ కూడా ఓ స్టార్ హీరో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అభిమానులు రివ్యూ ఇచ్చారు .

కాగా ఈ సినిమా ఇంతటి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో గాలోడు సినిమాకి సుధీర్ తీసుకున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది . అందుకున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి సుధీర్ ఏకంగా 50 లక్షల తీసుకున్నారట. నిజానికి హీరోగా సుధీర్ ఒక్క సినిమా హిట్ కొట్టలేదు.. కానీ ఈ రేంజ్ లో పారితోషకం తీసుకున్నాడు అంటే అది నిజంగా గ్రేట్. నాగచైతన్య లాంటి వాళ్ళ సినిమాకి 6 కోట్లు ఏడు కోట్లుగా తీసుకుంటున్నారు.. మరి అలాంటిది ఒక్క హిట్టు లేని సుధీర్ కూడా 50 లక్షలు తీసుకున్నాడు అంటే అది నిజంగా గ్రేట్ అంటున్నారు ఫ్రెండ్స్. అంతేకాదు సుధీర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని అందుకే పాజిటివ్ రిజల్ట్ వచ్చిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news